పురుషుడు చేస్తే ఓకే.. అదే మహిళ చేస్తే తప్పా? మలైకా అరోరా సంచలనం

సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో మనుషుల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలు, సాధారణ ప్రజానీకం బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీల పర్సనల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు నెటిజన్లు. వారి వారి వ్యక్తిగత విషయాల్లోకి ఎంటరై జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఈ కోవలోనే ఐటెం భామ మలైకా అరోరా, ఆమె బాయ్ ఫ్రెండ్ అర్జున్‌ కపూర్‌ విషయంలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన మలైకా నెటిజన్లకు దిమ్మతిరిగే కౌంటర్ వేసింది.

మలైకా అరోరా వయసు 45 సంవత్సరాలు. ఆమె లవర్ అర్జున్‌ కపూర్‌ ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడు. ఈ మధ్యకాలంలో డేటింగ్ చేస్తూ పలుసార్లు కెమెరాకు చిక్కిన ఈ జంట.. ఇటీవల తాము ప్రేమించుకుంటున్నామని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ కపుల్‌ ప్రేమ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ మొదలయ్యాయి. నీ కంటే చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్ చేయడం సిగ్గుగా లేదా? అంటూ ముఖ్యంగా మలైకా అరోరాను దూషిస్తూ మెసేజీలు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

Malaika Arora gets angry on trollers for age gap between Arjun Kapoor

అయితే తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన మలైకా.. తాను మళ్లీ ప్రేమలో పడడాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయింది. నా లవర్ అర్జున్ కపూర్ నాకంటే వయసులో చిన్నవాడైతే మీకొచ్చిన సమస్య ఏంటో అర్థంకావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా కామెంట్ చేసే వారి సమస్యల గురించి పట్టించుకునేంత తీరిక తనకు లేదని, ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు వయసు తేడా అనేది పట్టించుకోవాల్సిన అంశం కాదని మలైకా పేర్కొంది.

ఓ అబ్బాయి తన కన్నా చిన్న వయస్సు ఉన్న అమ్మాయితో డేటింగ్‌ చేస్తే అంగీకరించే మన సమాజం.. అదే పెద్ద వయస్సు మహిళ, చిన్న వయస్సు పురుషుడితో ప్రేమలో పడితే ఎందుకు అంగీకరించదని ఆమె ప్రశ్నించింది. పురుషుడు చేస్తే ఓకే.. అదే మహిళా చేస్తే తప్పా? అంటూ మలైకా అరోరా ఫైర్ అయింది. ఈ సందర్బంగా తానో తల్లినని గుర్తు చేసిన మలైకా.. ఓ బిడ్డకు తల్లినైనంత మాత్రాన హాట్‌గా కనిపించకూడదా? అని మలైకా ఘాటుగా రియాక్ట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X