మలైకా అరోరా అపార్ట్‌మెంట్‌ సీజ్.. బ్యూటీ చుట్టూ కరోనా వైరస్.. ప్రియుడికి దూరంగా ఉండలేక..

కరోనా ధాటికి దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు గాని కొందరు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఇక బాలీవుడ్ జనాలను కూడా ఈ మహమ్మారి అడుగు బయటపెట్టనివ్వడం లేదు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ కెవ్వు కేక బ్యుటి మలైకా అరోరా కూడా కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.

కరోనా కోరల్లో..

కరోనా కోరల్లో..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా యంగ్ హీరోయిన్స్ తరహాలో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం తన ఫొటోలు వైరల్ అయ్యేలా హాట్ గా పోజులు ఇవ్వడం ఈ బ్యూటీకి అలవాటే. ఇకపోతే ప్రస్తుతం మలైకా కరోనా కోరల్లో చిక్కుకున్నాట్లు తెలుస్తోంది.

అపార్ట్‌మెంట్‌ సీజ్..

అపార్ట్‌మెంట్‌ సీజ్..

ముంబైలో ఉంటున్న ఈ హాట్ హీరోయిన్ అపార్ట్‌మెంట్‌ చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌ లో కూడా ఒకరికి పాజిటివ్ అని తేలడంతో వెంటనే అధికారులు అపార్ట్‌మెంట్‌ ని సీజ్ చేశారు. నిత్యం షాపింగ్ లతో అలాగే తన యంగ్ బాయ్ ఫ్రెండ్ తో తిరిగే మలైకా క్వారంటైన్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది.

90వేలకు పైగా..

90వేలకు పైగా..

ఈ క్వారంటైన్ అమ్మడిని చాలా ఇబ్బందికి గురి చేస్తోందట. అయితే బయటకు వెళితే మాత్రం కఠిన చర్యలు తప్పవని ముంబై పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పటికే 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందుకే రెడ్ జోన్ లలో ఎవరిని బయటకు రానివ్వడం లేదు.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
ప్రేమాయణం..

ప్రేమాయణం..

మలైకా అరోరా ప్రేమ గురించి అందరికి తెలిసే ఉంటుంది. వయసు 46. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత విడాకులు తీసుకుంది. తనకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం తన కంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా అతనితో ఎఫైర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఆలోచనలపై ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X