పవన్‌ మూవీలో ఇద్దరు హీరోయిన్లు: ఒక హాట్ బ్యూటీ.. ఒక క్యూట్ లేడీకి ఆఫర్

సాధారణంగా టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో అయినా ఏడాది ఒక సినిమా చొప్పున చేయడం చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకోవడంతో పాటు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోన్న అతడు.. ఇప్పటికే పలు చిత్రాలను అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఒకటి.

నిజానికి 'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే పవన్ కల్యాణ్.. హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఈ మూవీని మాత్రం అనుకున్న సమయానికి మొదలు పెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఈ మెగా హీరో ఆపేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసింది. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Malavika and Sreeleela fix for Pawan Kalyan Ustaad Bhagat Singh

పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో రెండో ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు. అయితే, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కోసం మాత్రం ఆమెను తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ మాళవిక మోహనన్, క్యూట్ లేడీ శ్రీలీల హీరోయిన్లుగా చేస్తున్నారని తెలిసింది. అతి త్వరలోనే వీళ్లిద్దరి పేర్లను అధికారికంగా వెల్లడించబోతున్నారని సమాచారం. ఇందులో మాళవిక.. పవన్ భార్య పాత్రను చేస్తున్నట్లు మరో న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ మూవీ షూట్ మొదలు కాబోతుందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X