గ్లామరస్ బ్యూటీతో మహేశ్ బాబు రొమాన్స్: ఇది అస్సలు ఊహించి ఉండరు

కొంత కాలంగా వరుసగా హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది కేవలం కొంత మేర మాత్రమే షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు మరో ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. దీన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్నాడు. ఇది ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీని గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమాలో బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఎంతో మంది భామల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం మాలవిక మోహనన్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ చర్చలు కూడా జరిపిందని.. దీనికి వెంటనే ఆమె ఓకే చెప్పేసిందనే టాక్ వినిపిస్తోంది. ముంబైకు చెందిన ఈ హీరోయిన్‌కు సౌత్‌లో మంచి పేరు ఉంది. ఇప్పటికే ఈమె ఎన్నో చిత్రాల్లో నటించింది. అందులో 'మాస్టర్' కూడా ఉంది.

Malavika Mohanan Fix For Mahesh Trivikram Movie

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన కేయూ మోహనన్ కుమార్తెనే మాలవిక మోహనన్. ఈమె ఇప్పటికే మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ధనూష్‌తో నటిస్తోంది. ఈ క్రమంలోనే మహేశ్ సినిమాకు సైతం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి 'పార్థు' అనే టైటిల్ అనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X