Drishyam Movie: హాలీవుడ్‌లో దృశ్యం రీమేక్.. ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో వచ్చిందంటే?

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ దృశ్యం గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథాంశంతో వచ్చి అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్ లో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లీష్, స్పానిష్ లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా దృశ్యం రికార్డుకు ఎక్కబోతుంది. ఈ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. ముందుగా మలయాళ భాషలో మాత్రమే తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా బాగుండడంతో.. ముఖ్యంగా ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో రావడంతో ఈ సినిమాను చూసే వారి సంఖ్య పెరిగింది. కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులోకి తీసుకు వచ్చారు. అయితే తెలుగులో మాత్రం మోహన్ లాల్ కు బదులుగా వెంకటేషన్ నటించారు. ఇలా ఇక్కడ కూడా ఈ సినిమా హిట్ అయింది.

Malayala Black Buster Hit Film Drishyam Movie Going to Remade in Hollywood Check Details

ఆ తర్వాత తమిళం, కన్నడ, హిందీ, సింహలేసే, చైనీస్ భాషల్లో రీమేక్ చేయడం.. అక్కడ కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పార్ట్ 2ని తీసుకు వచ్చారు. అలా దృశ్యం 2 కూడా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన ఇంతకాలానికి మరో అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసింది. ముఖ్యంగా పదేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లోనూ రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారు. కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా స్పానిష్ భాషలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా హాలీవుడ్ లోనూ ఈ దృశ్యం సినిమాను ప్రకటించబోతున్నట్లు చెప్పారు. హాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి ఈ దృశ్యం సినిమాను ఇంగ్లీష్ వాళ్లకు అందరించబోతున్నారు. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి ఈ సినిమా అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది.

Malayala Black Buster Hit Film Drishyam Movie Going to Remade in Hollywood Check Details

ఇప్పటికే ఈ సినిమాలు ఇండోనేషియా, కొరియన్ భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. మరి హాలీవుడ్ లో ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారనేది మాత్రం ఇంకా తెలియదు. హాలీవుడ్ లో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X