twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ బరిలో జల్లికట్టు.. మలయాళ చిత్రానికి అరుదైన గుర్తింపు

    |

    ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న మలయాళ చిత్రం జల్లికట్టు 93వ అకాడమీ అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఆస్కార్ ఎంట్రీకి దాదాపు 27 చిత్రాలు పోటీ పడ్డాయి. శకుంతలా దేవి, శిఖర, గంజన్ సక్సేనా, ఛపాక్, ఏకే వర్సెస్ ఏకే, గులాబో సితాబో, భోంస్లే, ఛలాంగ్ ఈబ్ ఆలే ఊ, చెక్ పోస్టు, అట్కన్ చట్కన్, సీరియస్ మెన్, బుల్ బుల్, కమ్ యాబ్, ది స్కై ఈజ్ పింక్, చింటూ కా బర్త్ డే, బట్టిర్ స్వీట్ చిత్రాలు ఆస్కార్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకొన్నాయి.

    జల్లికట్టు ఎంపిక అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, జ్యూరీ బోర్డు చైర్మన్ రాహుల్ రావైల్ తెలిపారు. సినిమా థీమ్, ప్రొడక్షన్ క్వాలిటీ, లిజో జోస్ ఫెల్లిస్సెరీ డైరెక్షన్‌పై ప్రశంసలు గుప్పించారు. ఈ చిత్రంలో అంథోని వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సుబమన్ అబ్దసామ్యాడ్, సాంథీ బాలచంద్రన్ నటించారు.

     Malayalam movie Jallikattu selected as India’s official entry for the 93rd Oscar Awards

    ఆస్కార్ అవార్డుల కోసం గతంలో భారతీయ చిత్రాలు ఎక్కువ సంఖ్యలోనే నామినేట్ అయ్యాయి. రాక్‌స్టార్స్, న్యూటన్, కోర్టు, విసారణై, బర్భీ, ఇండియన్, పిప్లీ లైవ్ చిత్రాలు నామినేట్ అయినా అవార్డును గెలుచుకోలేకపోయాయి. ఈ సారి జల్లికట్టు చిత్రం అవార్డు గెలుచుకొంటుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.

    2021 అకాడమీ అవార్డుల కార్యక్రమం సాధారణంగా ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. అయితే ఈ సారి కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 25వ తేదీన జరుగనున్నాయి.

    English summary
    Malayalam movie Jallikattu selected as India’s official entry for the 93rd Oscar Awards. This news confirmed by Rahul Rawail, Chairman, Jury Board – Film Federation Of India. Rahul Rawail praised the director Lijo Jose Pellissery’s talent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X