For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Naga Chaitanya's Thank You.. సినిమా చూసేందుకు సెలవు.. కాలేజీ యాజమాన్యం నిర్ణయం

  |

  నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా "థ్యాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. "మనం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు "మారో..", "ఏంటో ఏంటేంటో..." చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ఈ చిత్ర నుంచి ఫేర్ వెల్ అనే పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కె కుమార్, సంగీత దర్శకుడు థమన్, ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా

  సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ..థ్యాంక్యూ ఒక బ్యూటిఫుల్ మూవీ. మన జీవితంలో చిన్నప్పటి నుంచి గొప్ప స్థాయికి చేరుకునే వరకు ఎంతోమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలో తెలుస్తుంది. ఈ సినిమా చూశాక మీరది అనూభూతి చెందుతారు. దర్శకుడు విక్రమ్ కు చాలా పెద్ద మనసుంది. ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు. దిల్ రాజు గారి పేరులోనే దిల్ ఉంది. ఆయన సంస్థలో నేను మూడు సినిమాలు చేస్తున్నాను. మజిలీ, థ్యాంక్యూ సినిమాల్లో చైతూ లుక్స్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాగ చైతన్యలో నాగార్జున కనిపించారు. ఈ ఫేర్ వెల్ సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు.

  Mallareddy colleage declares holliday for Naga Chaitanyas Thank You movie

  దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ..నా డియర్ ఫ్రెండ్ నాగ చైతన్యతో మరోసారి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజుకు థాంక్స్. థమన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మీకు సినిమా తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

  నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...మల్లారెడ్డి గార నాకు సోదరుడు. ఆయన రాజకీయాల్లోకి, నేను సినిమాల్లోకి రాకముందు నుంచీ మా కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఇవాళ మా థ్యాంక్యూ సినిమా కార్యక్రమం మీ అందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం, ఆ తర్వాత స్కూల్ మేట్స్ తో కలుస్తాం. ఆ తర్వాత కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న ఈ కాలేజ్ లైఫ్ ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగాలకు గురవుతామో ఈ ఫేర్ వెల్ పాట ద్వారా చెప్పాం. హ్యాపీ డేస్ సినిమాలో పాదమెటు పోతున్నా పాట నాకు చాలా ఇష్టం. నా సినిమాల్లో అలాంటి పాట పెట్టాలని అనుకున్నాం.

  Mallareddy colleage declares holliday for Naga Chaitanyas Thank You movie

  ఈ సినిమాలో కుదిరింది. థమన్ సూపర్బ్ ట్యూన్ ఇచ్చాడు. దర్శకుడు విక్రమ్ గతంలో 24, ఇష్క్, మనం లాంటి ఫీల్ గుడ్ ఫిలింస్ చేశాడు. ఈ థ్యాంక్యూ సినిమా కూడా అలాంటి సోల్ ఫుల్ సినిమా. మీరు సినిమా చూశాక ఇదే అనుభూతి కలుగుతుంది. సినిమా అంటే ప్యాషన్ ఉన్న హీరో నాగ చైతన్య. మీలాంటి కుర్రాడిలా ఉంటాడు. రెండున్నరేళ్లు మా సినిమా కోసం పనిచేశాడు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు, మూడు డిఫరెంట్ లుక్స్ లో నాగ చైతన్య కనిపిస్తాడు. అందుకోసం ఆయన ఎంతో శ్రమించాడు. మనమంతా జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి మనతో కలిసి నడిచిన వాళ్లకు, మనకు కావాల్సిన వాళ్లకు కృతజ్ఞత చెప్పడమే ఈ సినిమా. అన్నారు

  హీరో నాగ చైతన్య మాట్లాడుతూ...మనందరి జీవితాల్లో బెస్ట్ టైమ్ కాలేజ్ లైఫ్. ఆ తర్వాత అంతా ప్రపంచంతో పోటీ పడుతూ పరుగులు పెట్టాల్సిందే. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలే జీవితాంతం మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ కాలేజ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయండి. యూత్ సినిమాను ఎలా ఇష్టపడతారో అనేదే ఆలోచిస్తాం. రిలీజ్ రోజే థ్యాంక్యూ సినిమా చూడండి. సోషల్ మీడియా ద్వారా మీ స్పందన చెప్పండి. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తుంటాను. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కుమార్ కు కృతజ్ఞతలు చెబుతున్నా. మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం. జూలై 22న సినిమా చూడండి. అన్నారు.

  "థ్యాంక్యూ" సినిమా చూసేందుకు జూలై 22న ఒక పూట హాలీడే ఇస్తామని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ఈ సందర్భంగా ప్రకటించింది.

  English summary
  Naga Chaitanya's Thank You movie set to release on July 22nd. This movie promotional event held at mallareddy colleage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X