బిజీగా మారిన ‘మల్లేశం’ తండ్రి.. పలు ఆఫర్లతో చక్రపాణి ఆనంద
టాలీవుడ్‌లో ప్లే బ్యాక్ అనే సినిమా రిలీజ్‌కు ముందే ప్రేక్షకులను, సినీ వర్గాలను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, దర్శకుడు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హరిప్రసాద్ జక్కా డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మల్లేశంలో మామా కోడళ్లుగా నటించిన చక్రపాణి ఆనంద, అనన్య నాగళ్ల మళ్లీ కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తండ్రి, కూతుళ్లుగా కనిపించబోతున్నారు. మల్లేశం సినిమాలో వీరిద్దరి నటనకు మంచి ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే.
స్లే బ్యాక్ చిత్రంలో హీరోగా హుషారు ఫేమ్ దినేస్ తేజ్ నటిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి.. విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

కాగా, మల్లేశం సినిమాలో తండ్రి పాత్రలో విశేష ప్రజాదరణ కూడగట్టుకొన్న చక్రపాణి ఆనంద పలు సినిమాలతో బిజీగా మారిపోయారు. నిర్మాత కేఎస్ రామారావు నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నారు.
అలాగే దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించే విరాటపర్వంలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం, తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తనకు మంచి పేరును తీసుకువస్తుంది అని విలక్షణ నటుడు చక్రపాణి ఆనంద తెలిపారు.


Click it and Unblock the Notifications











