‘దేవుళ్లకే కాదు.. ప్రేక్షకులకు కిక్ ఎక్కించే సురాపానం.. ఫన్‌తో కూడిన ప్రేమకథ’
హీరోగానే కాకుండా సంపత్ కుమార్ దర్శకత్వం బాధ్యతలు చేపట్టిన సినిమా సురాపానం. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10 తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ...ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మనిషికే కాదు దేవుళ్లకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేది సురాపానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఊహతో తెరకెక్కించిన సినిమా ఇది. ట్యాగ్ లైన్ పెట్టినట్లే కిక్ అండ్ ఫన్ ఇస్తుంది. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే కథా నేపథ్యంతో మంచి ప్రేమ కథను కూడా చూపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంత నేపథ్యంతో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కంటెంట్‌తో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అలాంటి చిత్రమే సురాపానం. కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో ఏ అంశాలు ఉంటాయో ఈ సినిమాలోనూ అవన్నీ ఉంటాయి. సంపత్ కుమార్ హీరోగా నటిస్తూనే ఒక మంచి కథను అల్లి సినిమాను తెరకెక్కించాడు. సినిమాల మేకింగ్‌లో యువ ప్రతిభావంతులను ప్రభుత్వం తరుపున ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణ నేపథ్యంతో సినిమాలు చేయమని చెబుతున్నాం. గత ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు సంపత్ కుమార్. ఈ యంగ్ టాలెంట్ నిలబడితే మరికొంత మందికి స్ఫూర్తి కలుగుతుంది. సురాపానం సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమా కంటెంట్ చూశాక తెలుగు అమ్మాయి అని పిలుస్తున్నారు షూటింగ్ టైమ్ ను బాగా ఎంజాయ్ చేశాం. సినిమా విజయం మీద చాలా నమ్మకం ఉంది. థ్రిల్లింగ్ తో పాటు వినోదాన్ని అందించే సినిమా అవుతుంది. సురాపానం సక్సెస్ మీట్ లో కలుసుకుంటామని ఆశిస్తున్నా. అన్నారు
నటీనటులు: సంపత్ కుమార్, ప్రగ్యా నయన్, అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్ ,మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , విద్యాసాగర్ , అంజి బాబు , మాస్టర్ అఖిల్ తదితరులు
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
ఫోటోగ్రఫీ: విజయ్ ఠాగూర్
ఎడిటర్: జేపీ
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: మడూరి మధు
మాటలు: రాజేంద్రప్రసాద్ చిరుత
సాహిత్యం: సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్
ఆర్ట్ : భూపతి యాదగిరి
కొరియోగ్రఫీ: సురేష్ కనకం
కో-డైరెక్టర్: శ్రీనివాస్ రాయి
నిర్మాత: మట్ట మధు యాదవ్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ కుమార్


Click it and Unblock the Notifications











