కలర్ ఫుల్ యుగంలోనూ బ్లాక్ అండ్ వైట్‌లో రాబోతున్న మమ్ముట్టి సినిమా.. ఏది, ఎప్పుడంటే?

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త పాత్రల్లో కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే కాథల్ ది కోర్ సినిమాలో హోమో సెక్సువల్ పాత్రలో కనిపించి గట్టి షాకిచ్చాడు. ఆ సినిమాకు విపరీతమైన నెగిటివిటీ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఆయన మరో క్రేజీ సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ సినిమా కేవలం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండబోతుంది. ఇంత కలర్ ఫుల్ యుగంలోనూ బ్లాక్ అండ్ వైట్ సినిమాతో ఎందుకు రాబోతున్నారు ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాబోతున్న మరో కొత్త సినిమానే భ్రమయుగం. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మించబోతున్న ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టితోపాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్డా లిజ్, మణికందన్ ఆచారీ తదితరులు నటిస్తున్నారు.

Mammootty Bramayuugam Only in Black And White on Theatres Check Details

అలాగే భ్రముయుగం సినిమాకు.. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా.. షాఫిక్ మహ్మద్ ఆలీ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. క్రిస్టో జేవియర్ మ్యూజిక్ అందిస్తుండగా.. కేరళలో మరుగున పడి, బాహ్య ప్రపంచానికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ కథతో మమ్ముట్టి మన ముందుకు రాబోతున్నారు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందించారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాను గురించి తాజా ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే.. ఈ భ్రమయుగం సినిమాను నేటి కలర్ ఫుల్ యుగంలోనూ బ్లాక్ అండే వైట్ లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ కలర్ లో అయితేనే ఈ సినిమా చాలా బాగుంటుందని చిత్ర బృందం భావించిందట. ఈక్రమంలోనే మమ్ముట్టి చిత్రాన్ని కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్ లోనే రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడదుల కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mammootty Bramayuugam Only in Black And White on Theatres Check Details

తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి మరో 13 రోజుల్లో విడుదల కాబోతున్న మమ్ముట్టి మరో సరికొత్త ప్రయోగం ఏ రేంజ్ లో హిట్టు కొడుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X