టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో షాకింగ్ ఇన్సిడెంట్ .. లక్షల రూపాయలతో పరార్
టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్‌తో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. పోలీస్ క్యారెక్టర్లకు జీవం పోసి ఎంతోమందిని డిపార్ట్‌మెంట్ వైపు నడిపించేలా చేశారు రాజశేఖర్ . పవర్‌ఫుల్ రోల్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి ఏడిపించినా.. అల్లరి ప్రియుడిగా గిలిగింతలు పెట్టించినా ఆయనకే చెల్లింది. ఒకానొక దశలో అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ వంటి వారికి తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చి కలకలం రేపారు రాజశేఖర్.
కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు డాక్టర్ రాజశేఖర్. ఆయన పని అయిపోయిందని అవమానాలు ఎదుర్కొన్నప్పుడల్లా.. కమ్ బ్యాక్ మూవీస్‌తో ఆన్సర్ ఇవ్వడం రాజశేఖర్ స్టైల్. కొద్దినెలల క్రితం పీఎస్‌వీ గరుడవేగతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించారు. ఆ వెంటనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కిలో నటించి సత్తా చాటారు రాజశేఖర్.

ఎన్నో సినిమాల్లో తన సరసన హీరోయిన్‌గా నటించిన జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాజశేఖర్ . ఈ దంపతులకు శివానీ, శివాత్మిక అనే కుమార్తెలున్నారు. వీరు కూడా హీరోయిన్స్‌గా రాణిస్తూ.. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. చివరిగా నితిన్ హీరోగా రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో రాజశేఖర్ నటించారు. ప్రస్తుతం లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన నటిస్తున్నారు.
ఇకపోతే.. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ .. రాజశేఖర్ లీడ్ రోల్‌లో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిఖిల్‌తో స్పై మూవీ తీసిన గ్యారీ బీ బీహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తారని సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్‌లో గట్టి కంటెంట్, వెరైటీ కథలతో ప్రేక్షకులను అలరించాలని రాజశేఖర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇదిలాఉండగా రాజశేఖర్ ఇంట్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆయన నివాసంలో పనిమనిషిగా ఉంటోంది.. అదే జిల్లాకు చెందిన మరో వ్యక్తి కూడా రాజశేఖర్ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సదరు మహిళకు భర్తతో మనస్పర్థల కారణంగా వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెపై డ్రైవర్ కన్నేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించడంతో అతని మాటలు నమ్మి బంగారం, డబ్బు ఇచ్చింది. చివరికి ఆమెని పెళ్లి చేసుకుని రూ. 15 లక్షలకు పైగా నగదుతో ఆ వ్యక్తి పరారయ్యాడు. ఈ విషయం జీవిత, రాజశేఖర్ వరకు చేరడంతో వారిద్దరూ ఆమెకు ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











