Mana Shankara Vara Prasad Garu Public Talk: మన శంకర వరప్రసాద్ పబ్లిక్ టాక్ ఏంటి? చిరంజీవి మూవీ హిట్టా? ఫట్టా?

Mana Shankara Vara Prasad Garu Public Talk: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు నేడు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే రిలీజ్‌కు ఒక రోజు ముందే జనవరి 11 రాత్రి ప్రీమియర్ షోలు పడటంతో పబ్లిక్ టాక్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి- క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు మించి సినిమా ఉన్నట్టు గా తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎంటర్‌టైనర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

వింటేజ్ చిరంజీవి షో - ఫస్ట్ హాఫ్ హైలైట్
ప్రిమియర్స్ పబ్లిక్ టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ చిరంజీవి షోగా నడుస్తుందట. చిరంజీవి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా '70 ఏళ్లు దాటినా చిరు ఎనర్జీ తగ్గలేదు... బాస్ ఈజ్ బ్యాక్', అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హుక్ స్టెప్ సాంగ్, ఫస్ట్ ఫైట్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేశాయంటున్నారు. అలాగే చిరు - బుల్లిరాజు మధ్య కామెడీ సీన్స్ థియేటర్లలో నవ్వుల జాతరగా మారాయట.

Mana Shankara Vara Prasad Garu Public Talk

నయనతారతో కెమిస్ట్రీ - పాజిటివ్ వైబ్
చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన విషయం తెలిసిందే. ఈ నయనతార నటనకు కూడా మంచి స్పందన వస్తోంది. ఇది వీరిద్దరి మూడో సినిమా కావడం విశేషం. గతంలో సైరా నరసింహ రెడ్డి, గాడ్‌ఫాదర్ లో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ జోడీ ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కనిపించడం ప్రేక్షకులకు ప్లస్ అయిందని టాక్.

సెకండాఫ్‌లో వెంకీ మామ ఎంట్రీ

సెకండాఫ్ స్టార్టింగ్‌లో సినిమా కొద్దిగా నెమ్మదిస్తుందని టాక్ ఉన్నా... వెంకటేశ్ ఎంట్రీతో మూవీ పూర్తిగా వేరే ట్రాక్‌లోకి వెళ్తుందని అంటున్నారు. వెంకీ మామ కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలమైన సపోర్ట్‌గా నిలిచిందని పబ్లిక్ అభిప్రాయం. ముఖ్యంగా చిరంజీవి- వెంకటేశ్ కలిసి కనిపించే సన్నివేశాలు హైలైట్ అని అంటున్నారు. మెగా మాస్ సాంగ్, ఇద్దరూ కలిసి చేసే ఫైట్, కామెడీ సీన్స్ మెగా-విక్టరీ అభిమానులకు ఫుల్ ట్రీట్‌గా మారిందట. చిరు-వెంకీ సాంగ్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి సర్ప్రైజ్ ఎంట్రీ కూడా ఉందన్న టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అనిల్ మార్క్ కామెడీ
డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ కామెడీ మరోసారి వర్కౌట్ అయిందన్నది ఎక్కువ మంది మాట. పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్‌కి అరిటాకులో వేసి మరీ వడ్డించారని, చిరు కామెడీ టైమింగ్, హ్యూమర్, సెంటిమెంట్ సీన్స్, ఇంటర్వెల్‌లో బాస్ స్వాగ్ అన్నీ ప్లస్ పాయింట్స్‌గా చెబుతున్నారు. అయితే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా, కొంచెం సాగదీతగా అనిపిస్తాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది మాత్రం స్టోరీ పరంగా కొత్తదనం లేదని, నో-లాజిక్ కమర్షియల్ టెంప్లేట్‌లోనే సినిమా నడుస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. 'కథ పరంగా కాకుండా.. నవ్వుల కోసం వెళ్తే ఫుల్ ఎంజాయ్' చేయవచ్చని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్నారు.

ఇక మ్యూజిక్ పరంగా చూస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయని టాక్. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ థియేటర్లలో మంచి జోష్ తీసుకొస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ పుల్ ఎంటర్‌టైనింగ్, సెకండాఫ్ స్టోరీ కాస్త స్లోగా ఉన్నా.. వెంకటేశ్ ఎంట్రీతో ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ చేరిందట. చిరంజీవి వింటేజ్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, సాంగ్స్ అనే ఈ సినిమాకు బలంగా మారాయట.

ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఇది డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తోంది. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్ హిట్ అందుకున్న మన శివవర ప్రసాద్ గారు మరి కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X