Mana Shankara VaraPrasad Garu Trailer Review: మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జనవరి 4వ తేదీన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? అభిమానుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది పరిశీలిస్తే..

Mana Shankara VaraPrasad Garu Trailer Review in Telugu Chiranjeevi and Anil Ravipudi guaranteed full of enjoyment

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

అనిల్ రావిపూడి శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేశారు. వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్‌ను పరుగులు పెట్టించారు. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలకు పెట్టింది పేరైన అనిల్.. టైటిల్ గ్లింప్స్‌తోనే హిట్ కొట్టేశారు. ఆ తర్వాత లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్‌ను రంగంలోకి దించి మీసాల పిల్ల సాంగ్‌తో సినిమాపై మరింత హైప్ పెంచారు. ఆ తర్వాత శశిరేఖ సాంగ్, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో అంచనాలను పెంచేశారు అనిల్ రావిపూడి. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్‌ను విడుదల చేశారు.

దాదాపు 2.40 నిమిషాల నిడివితో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రారంభంలోనే ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ .. ఎలాంటి క్రిమినల్‌ని అయినా ఉతికి, పిండి ఆరేస్తారు అని బ్యాక్‌గ్రౌండ్‌లో చెబుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి బట్టలు ఉతుకుతూ, వంటలు చేస్తూ ఉంటారు. అతనే మన శంకర వరప్రసాద్ గారు అని ఎలివేషన్ ఇస్తారు. ఆ వెంటనే చిరంజీవి ఫైట్స్‌తో రౌడీల తుక్కురేగ్గొడతారు.

ఈ సీరియస్ యాక్షన్ మధ్యలో నయనతార- చిరంజీవిల మధ్య లవ్, రొమాంటిక్ సీన్స్ వస్తాయి. ఇంతలోనే నా జీవితం నుంచి వెళ్లిపో అని నయన్ క్లాస్ పీకుతుండగా చిరంజీవి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్లు నటించి లోపలికి వచ్చి తిట్టావా? అందరూ చూస్తున్నారు అని పంచ్ డైలాగ్ విసురుతాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడం, భార్యతో తిరిగి కలిసిపోయేందుకు చిరంజీవి చేసే అల్లరి కడుపుబ్బా నవ్వుతెప్పిస్తుంది.

మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని, మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ హై ఉంటదంటూ చిరంజీవి చెప్పే పంచ్ డైలాగ్ బాగుంది. ఈ మధ్యలో హీరోయిన్, ఆమె తండ్రి ప్రమాదంలో చిక్కుకోవడం.. రౌడీల నుంచి వారిని రక్షించడానికి చిరంజీవి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ఇక చివరిలో విక్టరీ వెంకటేష్ హెలికాఫ్టర్‌లో స్టైలీష్‌గా ఎంట్రీ ఇస్తారు. చూడటానికి మంచి ఫ్యామిలీమెన్‌లా ఉన్నావు.. ఇలా మాస్ ఎంట్రీలు ఇష్తున్నావేంటీ? అని చిరు అడగ్గా.. మాస్ కే బాస్‌లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటీ? అని వెంకీ కౌంటర్ ఇస్తాడు.

మొత్తంగా ట్రైలర్ చూస్తే.. పాత చిరంజీవి బయటికొచ్చినట్లుగానే కనిపిస్తోంది. తన మార్క్ పంచ్, వెటకారం కలగలిసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సీరియస్‌గా ఉంటూనే భార్య చేత చీవాట్లు తినే భర్తగా ఘరానా మొగుడు నాటి చిరుని గుర్తుచేశారు. నయనతారతో మెగాస్టార్ కెమెస్ట్రీ, వారిద్దరి విడాకులు చుట్టూ వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇక చివరిలో తన పవర్‌ఫుల్ ఎంట్రీతో మొత్తం క్రెడిట్ కొట్టేశారు చిరు. నిర్మాణ విలువలు బాగున్నాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి బాగున్నాయి. శంకర ప్రసాద్ - శశిరేఖలు ఎందుకు విడిపోయారు? భార్యతో శంకర ప్రసాద్ తిరిగి కలిశాడా? తన అత్తారింటిపై దాడి చేసింది ఎవరు? తెలియాలంటే జనవరి 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X