twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchi Rojulu Vachayi Twitter Review: హీరోను ఎందుకు పెట్టారో.. ఆ విషయంలో మారుతి బెస్ట్!

    |

    కామెడీ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మారుతి చాలా రోజుల తర్వాత చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి ఎక్కువగా చిన్న సినిమాలతోనే మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ప్రతి రోజు పండగే లాంటి బిగ్ హిట్ అనంతరం ఈ కామెడీ దర్శకుడు ఈసారి ఓకే లోకేషన్ లో ఫుల్ సినిమాను తెరకెక్కించాడు.
    సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ కామెడీ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఇక పండగకు ఒక రోజు ముందే సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను కూడా వేశారు. ఇక సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

    20 రోజుల్లో కథ రాసి

    వీలైనంత వరకు మాంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే దర్శకుడు మారుతి ఈసారి కూడా అదే ఫార్మాట్ లో వచ్చాడు. మంచి రోజులు వచ్చాయి సినిమా కథను 20 రోజుల్లో రాసుకున్న మారుతి సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేశాడట. ఇక నటీనటులు కూడా మొదట కథ వినకుండానే ఓకే చేశారని దర్శకుడు తెలియజేశాడు.

    హీరో సైడ్ రోల్

    సినిమా కథ పూర్తికా ఒకే కాలనీలో కొనసాగుతుందట. ఇక హీరో కంటే ఎక్కువగా మిగతా పాత్రలను మారుతి ఎక్కువగా హైలెట్ చేసినట్లు చెబుతున్నారు. అందరు కమెడియన్స్ మెయిన్ రోల్ చేయగా హీరో మాత్రం సైడ్ రోల్ చేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో సంతోష్ శోభన్ డిఫరెంట్ కామెడీ యాంగిల్ లో కనిపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ అతని పాత్రకు అనుకున్నంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా అంటున్నారు.

    అతని పాత్ర హైలెట్

    హీరో హీరోయిన్ పాత్రకు అనుకున్నంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం థియేటర్ లో చాలా రోజుల తరువాత నవ్వుకున్నాం అంటూ చిత్ర యూనిట్ సబ్యులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాలో కమెడియన్ అజయ్ ఘోష్ పాత్రను చాలా కామెడిగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అతని పాత్ర సినిమా మొత్తంలో చాలా హైలెట్ గా నిలిచిందని కూడా చెబుతున్నారు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే సినిమా నచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    నిబ్బి నిబ్బా కామెడీ

    ఇక కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా రొటీన్ గా ఉన్నాయని కూడా చెబుతున్నారు. వీలైనంత వరకు సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఉంటే సినిమా నచ్చే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతోంది. కొన్ని సన్నివేశాలతో యవరేజ్ గా ఉందని కూడా అంటున్నారు. ఇక ఇంటర్ లో ఉండే నిబ్బి నిబ్బా కామెడీ సీన్స్ మారుతి మార్క్ కామెడీ తరహాలో ఉన్నాయని అంటున్నారు.

    Recommended Video

    Director Maruthi Vs Anchor Manjusha Truth Or Dare | Manchi Rojulochaie
    మంచి సందేశం

    మంచి సందేశం


    ఫస్ట్ హాఫ్ బావుందని కొందరు ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కూల్ సాంగ్స్ మ్యూజిక్ డ్యాన్స్ కూడా బావున్నాయని కానీ సెకండ్ హాఫ్ మాత్రం మరింత కామెడీగా ఉందని అంటున్నారు. ఇక సుదర్శన్ పాత్ర కూడా బావుందని అంటూ మారుతి మార్క్ డైలాగ్స్ కూడా అద్బుతమని చెబుతున్నారు. ఇక ప్రస్తుత ఉన్న పరిస్థితులకు మంచి సందేశం అంటూ వివరణ ఇస్తున్నారు. ముఖ్యంగా సో సో అనే పాట చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

    English summary
    Manchi Rojulu Vachayi movie Twitter Review,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X