ఫామ్‌లోకి వస్తోన్న మంచు హీరోలు.. ఈసారైనా విజయాలు వరిస్తాయా?

తెలుగు ఇండస్ట్రీలో అన్ని ఫ్యామిలీలు బాగానే ఉన్నాయి. హిట్ల మీద హిట్లు కొడుతూ జనాల నోళ్లలో నానుతూ ఉంటారు. అయితే మంచు ఫ్యామిలీ మాత్రం సరైన సినిమాలను చేయలేక, మంచి చిత్రాలను నిర్మించలేక చేతులెత్తేశారు. చివరగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గాయత్రి సినిమా ఘోర పరాజయంతో మరింత డీలా పడింది. దానికి తోడు మంచు ఫ్యామిలీ హీరోలు కూడా ఎప్పుడో ఫామ్‌ను కోల్పోయారు.

విజయాల్లేని విష్ణు..

విజయాల్లేని విష్ణు..

ఒకప్పుడు ఢీ, దేనికైనా రెడీ లాంటి మంచి చిత్రాలను చేసి విజయాల అందుకున్నాడు మంచు విష్ణు. తనకు కలిసి వచ్చిన కామెడీ జానర్‌ను వదిలి.. హీరోయిజం, యాక్షన్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. చివరగా ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ లాంటి డిజాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులకు విసుగు పుట్టించాడు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

హాలీవుడ్ దర్శకుడితో..

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు మోసగాళ్లు మొదలైంది. ఈ మూవీ గురించి రక రకాల వార్తలు రాగా.. తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో! అంటూ పోస్టర్ పై ముద్రించడం చూస్తుంటే నిజఘటనల కథతో ఆసక్తికర సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. 2020 వేసవిలో రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది. మరి ఈ చిత్రమైన విష్ణు కలను సాకారం చేస్తుందో లేదో చూడాలి.

వ్యక్తిగత కారణాలతో సతమతమైన మనోజ్..

మంచు మనోజ్‌కు అటు సినీ కెరీర్, ఇటు పర్సనల్ కెరీర్ రెండూ బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నాయి. భార్యతో విడాకులు అయిన తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ హీరో.. అభిమానులతో చాలా కాలం తరువాత టచ్ లోకి వచ్చాడు. భార్య నుంచి విడిపోయాకే కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది.

Recommended Video

CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
కలుద్దాం.. కుమ్మేద్దాం..

కలుద్దాం.. కుమ్మేద్దాం..

ఈ జోష్‌లోనే ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతోన్నట్టు ప్రకటించాడు. చివరగా మంచు మనోజ్ అయితే 2017లో ‘ఒక్కడు మిగిలాడు'తో పలకరించి ఆ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. కొత్త కథ చిత్రీకరణకు రెడీగా ఉందని, త్వరలో కలుద్దాం..కుమ్మేద్దాం అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే.. మంచు వారింట సంబరాలు మొదలయ్యేట్టే కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X