మంచు లక్ష్మిని ఎత్తి పడేసిన స్టార్ హీరోలు.. కర్మ కొద్దీ ఇలా జరిగింది అంటూ.. వీడియో పోస్ట్
మంచు వారి ఫ్యామిలీలో అందరూ కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తూ ఉంటారు. ఎదో ఒక విషయంలో హైలెట్ అవుతూనే ఉంటారు. ఇక అందరికంటే ఎక్కువగా ఇంటర్నేట్ ప్రపంచంలో మంచు లక్ష్మి సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆమెకి సంబంధించిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు లక్ష్మి కొంత కోపానికి లోనయ్యింది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా
మంచు వారి అమ్మాయి లక్ష్మీ నటిగానే కాకుండా యాంకర్ గా హోస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఎదో ఒక ఫొటో పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక తన హ్యాపీ మూమెంట్స్ ను కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అనుభవాలను పంచుకుంటుంది.

యూట్యూబ్ ఛానెల్ ద్వారా..
లక్ష్మి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అందులో మొదట తన హోమ్ టూర్ వీడియోతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుతుంది. ఆ తర్వాత మోహన్ బాబు కు సంబంధించిన హోమ్ టూర్ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా ఈజీగా ట్రెండింగ్ లిస్ట్లోకి చేరిపోయింది.

కోలుకున్న లక్ష్మీ
అంతేకాకుండా మంచులక్ష్మి ఎన్నో ప్రత్యేకమైన విషయాలను తన సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇటీవల కరోనా బారిన పడిన మంచు లక్ష్మి మళ్లీ పండగ సమయానికి కొలుకొని ఫామ్ లోకి వచ్చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నవ్వుకున్న మంచు లక్ష్మి
ఇటీవల ఒక పోస్ట్ చేసిన మంచు లక్ష్మి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మంచు విష్ణు తన కుటుంబ సభ్యులందరికీ కూడా స్విమ్మింగ్ పూల్ లోకి వెనకాల నుండి తోసివేయడం చూస్తుంటే ఎంత అల్లరి చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంచు లక్ష్మి ఆ వీడియోను షూట్ చేస్తూ నవ్వుకుంది.
మంచు లక్ష్మిని ఎత్తేసిన విష్ణు, మోహన్ బాబు
అంతే కాకుండా మంచు లక్ష్మి కూడా వెనకాలనుంచి ఎత్తుకొని డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్లోకి ఎత్తేశారు. కేవలం మంచు విష్ణు మాత్రమే కాకుండా వారి తండ్రి మోహన్ బాబు కూడా కొడుకు కు సహాయంగా నిలిచినాడు.. మంచు విష్ణు వాళ్ళ చేయడంతో లక్ష్మి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అంతకుముందు వీడియోలు తీసి నవ్వుకున్న లక్ష్మీ ఖర్మ కొద్దీ ఇలా జరిగింది అని సరదాగా షేర్ చేసుకుంది.

వెబ్ సీరీస్ లతో
కేవలం నటిగానే కాకుండా యాంకర్ గా హోస్ట్ గా నిర్మాతగా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. పెద్దగా కాంట్రవర్సీ లోకి వెళ్లకుండా.. తనదైన శైలిలో ముందుకు సాగుతూ ఉంటారు. ప్రస్తుతం మంచు లక్ష్మి వెబ్ సీరీస్ లలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











