twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యాక్సిన్ వేయించుకున్న మంచు లక్ష్మి.. అలా దొరికేయడంతో, ఆడేసుకుంటున్న నెటిజన్లు!

    |

    డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తర్వాత తనదైన ముద్ర వేసుకుంది. నటిగా, యాంకర్ గా, సింగర్ గా, నిర్మాతగా ఇలా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ ఆమె టాలీవుడ్ లో అందరికీ నోటెడ్ అయిపొయింది. అయితే మంచు లక్ష్మి కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ, అయితే ఆ ఫాలోయింగ్ ఇప్పుడు ఆమెను ట్రోల్స్ బారిన పడేలా చేస్తుంది. గతంలో మంత్రి కేటీఆర్ కి కరోనా వచ్చిన సమయంలో తన సినిమాలు చూడమని సరదాగా కామెంట్ చేసిన పాపానికి ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోగా ఆ విషయం మీద కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Manchu Lakshmi 45 ఏళ్లు దాటిన వ్యక్తా ? సెలబ్రిటీ స్టేటస్ వల్లే అంటున్న నెటిజన్లు | Filmibeat Telugu
    నిజానికి కొద్ది రోజుల క్రితం

    నిజానికి కొద్ది రోజుల క్రితం

    భారతదేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపధ్యంలోనే వ్యాక్సినేషన్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్స్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నిజానికి కొద్ది రోజుల క్రితం వరకు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చేవారు. కానీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా 18 ఏళ్ళ పైబడిన అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 18 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ వేయడం లేదు. వ్యాక్సిన్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఊహించిన మేర వ్యాక్సిన్ డోసులు రాకపోవడంతో కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు.

    ఏడాది మొత్తానికి అదే హైలెట్

    తాజాగా ఈ రోజు మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని అందరికీ చెప్పి అందరిలో వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే ఆసక్తి కలిగించాలి అని ఆమె అనుకున్నారు. అందుకే ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించి 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఆమె కోరారు. ఈ రోజు యశోద ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నా అని పేర్కొన్న మంచు లక్ష్మి ఈ హాస్పిటల్ లో చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, నాకు కాస్త రిలీఫ్ గా ఉంది ఈ ఏడాది ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వాళ్లకి ఈ ఏడాది మొత్తానికి అదే హైలెట్ అని ఆమె చెప్పుకొచ్చింది.

    కేర్ తీసుకుని మాకు వ్యాక్సిన్ వేయండి

    కేర్ తీసుకుని మాకు వ్యాక్సిన్ వేయండి

    అంతేకాక మీరు 18 ఏళ్లు పైబడిన వారైతే కచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ కోసం వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని ఈ మహమ్మారి తో పోరాడాలంటే ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం సరైన ఆయుధం అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాక మీరు తీసుకోవడమే కాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని ఆమె పేర్కొంది. అలాగే ఈ కరోనా మహమ్మారితో పోరాటంలో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న అందరు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. మీరు కేర్ తీసుకుని మాకు వ్యాక్సిన్ వేయండి అంటూ కోరింది.

    సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టే

    సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టే

    ఇప్పుడు ఆమె వ్యాక్సిన్ వేయించుకోవడమే నెటిజన్లకు పెద్ద ఆయుధంగా మారింది. దానికి కారణం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి తప్ప ఆ లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. సరిపడా వ్యాక్సిన్ డోసులు లేని కారణంగా కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే డోసులు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇప్పుడు మొదటి డోస్ ఇవ్వడం పూర్తిగా నిలిపివేశారు. కేవలం మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ వేసుకోవడానికి ఎదురుచూస్తున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి వ్యాక్సిన్ వేయించుకోవడం తో ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. డబ్బుంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని ఆమెను ఆడిపోసుకుంటున్నారు.

    45 ఏళ్లు దాటిన వ్యక్తా ?

    45 ఏళ్లు దాటిన వ్యక్తా ?

    పోనీ ఆమె 45 ఏళ్లు దాటిన వ్యక్తా ? అంటే కాదు ఆమెకు కేవలం 43 ఏళ్లు మాత్రమే కావడంతో సెలబ్రిటీ స్టేటస్ అడ్డం పెట్టుకుని ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ మేరకు వార్తల వీడియోలు సైతం పోస్ట్ చేసి ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమెకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ని నేరుగా వ్యాక్సిన్ తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడినుంచి వ్యాక్సిన్ డోసులు కొనుక్కోవాలని ఆదేశాలిచ్చింది. సో ఇప్పుడు మంచు లక్ష్మి వేయించుకున్న ది ప్రైవేట్ హాస్పిటల్ లో కాబట్టి ఆమె చేసిన తప్పు ఏమీ లేదని కొందరు ఆమెకు వత్తాసు పలుకుతున్నారు.

    English summary
    As we all know vaccination process all over the India is going in full swing. Recently Telugu actress Manchu Lakshmi took her first vaccine shot at yashoda hospitals Hyderabad. And then she shared this in her social media and urged all the 18 plus people to register themselves in portal and take the vaccination. But some people in social media are trolling her for taking vaccination as both the Telugu state governments is providing vaccination to 45 + people only. They are targeting Manchu Lakshmi that how can she get the vaccination without meeting 45 plus age criteria
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X