మంచు లక్ష్మి బ్యూటిఫుల్ ఫోటో వైరల్.. క్వారంటైన్‌లో ఉంటూ ఫోటో షేర్ చేసి..
ఇటీవల కాలంలో చాలా ఉంది నటీమణులు వారి గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రం వయసుతో సంబంధం లేకుండా హాట్ ఫోజులతో షాక్ ఇస్తున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు మామూలుగా ఉండటం లేదు. గ్లామరస్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా అప్పుడప్పుడు మంచు లక్ష్మి కూడా తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉన్న మంచు లక్ష్మి ఒక్కసారిగా కొత్త హాట్ స్టిల్ తో దర్శనమిచ్చింది.

కాంట్రవర్సీ లోకి వెళ్లకుండా..
కేవలం నటుడిగానే కాకుండా యాంకర్ గా హోస్ట్ గా నిర్మాతగా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. పెద్దగా కాంట్రవర్సీ లోకి వెళ్లకుండా.. తనదైన శైలిలో ముందుకు సాగుతూ ఉంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్నారు.

నిర్మాతగా కూడా..
మొదట ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి ఆ తర్వాత అనగనగా ఒక ధీరుడు సినిమాతో మెయిన్ విలన్ గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కొన్ని ప్రయోగాత్మకమైన పాత్రల్లో కనిపించింది. గుండెల్లో గోదారి సినిమాతో మంచి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

44 ఏళ్ళ వయసులో..
మంచు లక్ష్మి తన తన ఫిట్నెస్ తోనే అందరినీ ఎంతగానో ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఆమెకు 44 ఏళ్లు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది నేటి తరం హీరోయిన్స్ కంటే కూడా చాలా ఎనర్జీ గా కనిపిస్తూ ఉంటారు. రకరకాల వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్య సూత్రాలు కూడా అందిస్తూ ఉంటారు.

కరోనా పాజిటివ్..
ఇటీవల మంచు లక్ష్మి కరోనా భారీన పడిన విషయం తెలిసిందే. ఇక పాజిటివ్ అని తెలియగానే క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఆమె నాచురల్ ఈ క్వారంటైన్ లో నేచురల్ గా ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. వీలైనంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆమె సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉన్నారు.

చిన్న గౌనులో గ్లామరస్ లుక్
ఇక మంచు లక్ష్మి క్వారంటైన్ లో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆమె గ్లామరస్ లుక్ లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక చిన్న గౌనులో మోడల్ తరహాలో మంచు లక్ష్మి ఘాటైన స్టైల్ తో కనిపించగానే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్
ఇక నిర్మాతగా చివరగా దొంగాట అనే సినిమా చేసిన మంచు లక్ష్మి ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాలను నిర్మించలేదు. ఎక్కువగా వెబ్ సీరిస్ లతో రియాలిటీ షోలతో హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. అంతే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టిన మంచు లక్ష్మి తన సొంత ఇంటి హోమ్ టూర్ తో పాటు తండ్రి మోహన్ బాబు హోమ్ టూర్ చేసి మిలియన్స్ వ్యూవ్స్ అందుకుంది.


Click it and Unblock the Notifications











