నా ఇల్లు కాలిపోయినప్పుడు అదొక్కటి మాత్రమే మిగిలింది.. దానికి ఒక చరిత్ర ఉంది: మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వం నుంచి వచ్చిన హీరోలు ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. కొంతవరకూ వారి సొంత నిర్మాణంలోనే సినిమాలు చేసుకుంటున్నారు. ఇక వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన బ్యానర్ ఉండడం విశేషం. ఇక మంచు మోహన్ బాబు ఏకైక కూతురు మంచు లక్ష్మి కూడా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాతగానే కాకుండా నటిగా యాంకర్ గా హోస్ట్ గా కూడా వివిధ విభాగాల్లో అడుగులు వేసి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకుంది. విమర్శలు ట్రోల్స్ ఎన్ని వచ్చినా కూడా వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా ముందుకు సాగింది.
Recommended Video

కొన్ని గంటల్లోనే ట్రేడింగ్
అప్పుడప్పుడు మంచు లక్ష్మికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో మంచు లక్ష్మి హోమ్ టూర్ వీడియోను పోస్ట్ చేయగా అది కూడా కొన్ని గంటల్లోనే ట్రేడింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది. హైదరాబాద్ లోనే మంచు లక్ష్మి తన సొంత ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. తండ్రి మోహన్ బాబు ఎంతో ఇష్టంగా కూతురి కోసం ఆ ఇంటిని కట్టించాడు. ఇక ఆ ఇంటిని తనకు నచ్చినట్లుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారట. తనకిష్టమైన ప్రత్యేకమైన వస్తువులను మాత్రం ఆమె అలాగే భద్రంగా దాచుకున్నారు.

ఇల్లు కాలిపోయినప్పుడు
ఆమె ఇంట్లో ప్రతి వస్తువు ఒక జ్ఞాపకమే అంటూ ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటాయని కూడా హోమ్ టూర్ లో వివరణ ఇచ్చింది. గతంలో ఉన్నత చదువుల కోసం మంచు లక్ష్మి యూఎస్ లో కూడా ఉండాల్సి వచ్చింది. ఇక అక్కడ తన ఇల్లు కాలిపోయినప్పుడు కేవలం ఓ పెయింటింగ్ మాత్రమే మిగిలిందని చెప్పింది. అయితే ఆ ఇల్లు ఎందుకు కాలిపోయింది అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. కానీ ఆ పెయింటింగ్ అంటే మాత్రం తనకెంతో ఇష్టమని తెలిపారు.

అవి ఎంతో ఇష్టమని అంటూ..
నటిగా, వ్యాఖ్యాతగా రానిస్తున్న మంచు లక్ష్మి మొదిసారిగా తన హోమ్ టూర్ వీడియోని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు.. చెబుతూ ఎప్పటికప్పుడు తనకు నచ్చినట్లుగా ఆ ఇంటిని మార్చుకున్నట్లు చెప్పారు. అయితే లక్ష్మి తన ఇంట్లో ఎక్కువగా పెయింటింగ్స్ తోనే నింపేశారు. ఆర్ట్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని అంటూ నచ్చితే వాటి ధరను ఏమాత్రం చూడకుండా కొనేస్తారని అర్థమవుతోంది.. టీ కలెక్షన్స్ తో పాటు ఫొటో కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, షూ కలెక్షన్స్ అలాగే ఇంట్లో ఉన్న ఎన్నో పాత వస్తువుల గురించి కూడా లక్ష్మి ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
దానికి ఒక చరిత్ర ఉంది..
ఇక ఇంట్లో ఉన్న ఒక ప్రత్యేకమైన డైనింగ్ టేబుల్ ను చూపిస్తూ దానికి ఓక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉందని అన్నారు.. సీనియర్ ఎన్టీఆర్, శివాజీ గణేశన్ వంటి ఎంతో మంది మంది ప్రముఖులు ఆ డైనింగ్ టేబుల్‌పై భోజనం చేశారని.. అందుకే దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నానని అన్నారు. ఎప్పుడూ కూడా అది శుభ్రంగా ఉంటుందని నాన్నగారు ఇది ఎంతో ప్రేమగా ఇచ్చినట్లు మంచు లక్ష్మి వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ ఓటీటీ కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.


Click it and Unblock the Notifications











