twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మీకి యాక్సిడెంట్... రక్తమోడుతున్న ఫోటోలు వైరల్.. అసలు ఏమైందంటే?

    |

    డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తర్వాత తనదైన ముద్ర వేసుకుంది. నటిగా, యాంకర్ గా, సింగర్ గా, నిర్మాతగా ఇలా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ ఆమె టాలీవుడ్ లో అందరికీ సుపరిచితం అయింది. అయితే మంచు లక్ష్మి కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ, అయితే ఆ ఫాలోయింగ్ కారణంగా ఆమె ఎక్కువ ట్రోల్స్ బారిన పడేలా చేస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

    వారసురాలిగా

    వారసురాలిగా

    మంచు మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మి చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ కి పరిచయమైంది. మంచు లక్ష్మీ టాలీవుడ్‌లోకి రాడానికి ముందే 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలో కూడా చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మీ టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది.

    అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో

    అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో

    ఇక మంచు లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగులో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగటివ్ రోల్ చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కూడా కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదావరి'లో లీడ్ రోల్ లో నటించి అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది.

    నిర్మాతగా

    నిర్మాతగా

    చిన్న వయసులోనే నిర్మాతగా మారిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. అయితే ఆమె గాయపడి, రక్తం కారేలా ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఏమైంది? అని అభిమానులు, ఫాలోవర్స్ చాలా మంది కంగారు పడ్డారు. అయితే... అవి నిజమైన గాయాలు కావట.

    రీల్ యాక్సిడెంట్

    రీల్ యాక్సిడెంట్

    ఆమెకు యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే, కానీ అది రియాల్ యాక్సిడెంట్ కాదు, రీల్ యాక్సిడెంట్! షూటింగ్ కోసం ఆ విధంగా ఆమె మేకప్ వేసుకున్నారన్న లక్ష్మీ మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే, ఆమె చేతిలో తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఓ సినిమాలో ఆమె ఫైట్ సీన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న క్రమంలో ఆమె గాయపడినట్టు కన్పించాల్సి వచ్చింది.

    రియల్ యాక్సిడెంట్ కాదు

    రియల్ యాక్సిడెంట్ కాదు

    దీంతో అలా మేకప్ చేయబడిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమెకు నిజంగా యాక్సిడెంట్ అయింది అనుకున్నారు. ఆమెకు మెసేజ్ లు చేశారు. దీంతో లక్ష్మీ మంచు అసలు విషయం చెప్పారు. "ఓకే... ఓకే... నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రక్తం ఉన్న ఆ చెయ్యి, మోకాలి ఫొటోలు ఓ షూటింగ్‌లోవి, రియల్ యాక్సిడెంట్ కాదు. చాలా మంది నా గురించి ఆలోచిస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. లవ్ యు ఆల్" అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.

    English summary
    Manchu Lakshmi injured Photos Viral On Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X