దోశలు వేయడంలో చిరు ప్రత్యేకత.. ఎలా తిప్పారో చూశారా?.. వావ్ అమేజింగ్ అంటోన్న మంచు లక్ష్మీ
చిరంజీవి దోశలు వేయడంలో నిష్ణాతుడన్న సంగతి తెలిసిందే. చిరు వేసే దోశలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. చిరు దోశ అంటూ ఛట్నీస్ అనే రెస్టారెంట్‌లో సపరేట్ మెనూ కూడా ఉంటుంది. అంటే దాని ప్రత్యేకత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దోశల వెనుక పెద్ద కథే ఉంది. చిరంజీవే స్వయంగా వాటి వెనుకున్న కథను కూడా ఎన్నో సార్లు వివరించాడు. అయితే ఇన్నాళ్లు చిరు మాటలతోనే దోశ రుచి చూపించాడు. అయితే మొదటి సారి చిరు దోశ వేస్తే ఎలా ఉంటుందో, ఎలా వేస్తాడో జనాలకు తెలిసింది.చిరంజీవి దోశలు వేయడంలో నిష్ణాతుడన్న సంగతి తెలిసిందే. చిరు వేసే దోశలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. చిరు దోశ అంటూ ఛట్నీస్ అనే రెస్టారెంట్‌లో సపరేట్ మెనూ కూడా ఉంటుంది. అంటే దాని ప్రత్యేకత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దోశల వెనుక పెద్ద కథే ఉంది. చిరంజీవే స్వయంగా వాటి వెనుకున్న కథను కూడా ఎన్నో సార్లు వివరించాడు. అయితే ఇన్నాళ్లు చిరు మాటలతోనే దోశ రుచి చూపించాడు. అయితే మొదటి సారి చిరు దోశ వేస్తే ఎలా ఉంటుందో, ఎలా వేస్తాడో జనాలకు తెలిసింది.
Recommended Video

చిరు దోశ అంటూ..
షూటింగ్‌లో భాగంగా ఓ చోటకు వెళ్లిన చిరంజీవి అక్కడి దోశను రుచి చూశాడట. అయితే అది ఎలా తయారు చేశారు. ఆ విధానం మాత్రం కనుక్కోలేకపోయాడట. అయితే ఇంటికి వచ్చిన చిరు మాత్రం దాని గురించే ఆలోచిస్తూ ప్రయత్నించాడట.

ఏకంగా మెనూలోనే చేరిపోయింది..
అలాంటి రుచితోనే దోశను వేయడం ప్రారంభించాడట. అయితే అలా ప్రయత్నించగా అంతకు మించిన రుచితో దోశ వచ్చిందంటా. అలా ఒక రోజు ‘ఛట్నీస్' హోటల్ యజమాని, మిత్రుడు ఇంటికి అతిథిగా వచ్చారట. ఆ సమయంలో చిరు దోశలను రుచి చూపించగా.. తమ హోటల్‌లో ‘చిరు దోశ'గా మెనూలో చేర్చుకుంటామని అడిగారట. అలా చిరు దోశ ఎంతో ఫేమస్ అయింది.
తాజాగా చిరు దోశ వీడియో..
ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ఛాలెంజ్ అందరికీ తెలిసిందే. ఇంట్లో మహిళలకు సాయం చేయాలని, మగవారు కూడా ఇంటి పనులు చేయాలని సవాల్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. చిరు దోశలు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇందులో చిరు వేసిన దోశలు, ఆ స్టైల్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వావ్, అమేజింగ్..
చిరు దోశ విధానం చూస్తే.. ఎంత ప్రొఫెషనల్‌గా చేశాడో అన్న ఆశ్చర్యం, అనుమానం అన్నీ కలుగుతాయి. పెనంపై దోశ వేసి, దానిపై ఉప్మా రాసి.. దాన్ని గాల్లోని తిప్పేసి, అటు ఇటు కాల్చడం చూసి మంచు లక్ష్మీ ఆశ్చర్యపోయింది. ఉప్మా రాశాక ఎలా ఫ్లిప్ చేశారో చూశారా వావ్ అమేజింగ్ అంటూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











