తెలంగాణ గవర్నర్‌ను కలిసిన మంచు లక్ష్మీ.. కారణం అదేనా..?
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకత ఉంది. అందునా మంచు లక్ష్మీకి అందరి కంటే కాసింత ఎక్కువ పాపులార్టీనే ఉంది. ఆమె మాట్లాడే తీరు, మీడియా ముందుకు కనిపించే తీరు ఇలా అన్నింటిలో విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఫుల్ స్వింగ్ మీదుంది. ఓ వైపు మంచు విష్ణు హాలీవుడ్ ప్రాజెక్ట్స్, మరోవైపు మంచు మనోజ్ ప్యాన్ ఇండియా సినిమా, ఇంకోవైపు సామాజిక సేవలు, యూట్యూబ్ చానెల్ నిర్వహణ,అవగాహనా కార్యక్రమాలు అంటూ మంచు లక్ష్మీ ఇలా ఎవరికి వారే ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.
తాజగా మంచు లక్ష్మీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్చంద సేవా సంస్థ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయని, అందులో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కోరేందుకు కలిసినట్టు తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో పాల్గొంటానని హామి ఇచ్చినట్టు వినికిడి. ఈ మేరకు గవర్నర్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి ఈ మధ్య హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్‌లో చిట్టి చిలకమ్మ అంటూ పిల్లలకు, పెద్దలకు అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా తన కూతురు పాడిన అయిగిరి నందిని స్తోత్రం వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. విద్యా నిర్వాణ టాలెంట్‌కు, గాత్రానికి నెటిజన్లు ఫిదా అయి ప్రశంసల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











