Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గ్లామర్ షోతో మంచు లక్ష్మి రచ్చ.. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే!
మంచు వారి ఫ్యామిలీలో మోహన్ బాబు వేసిన బాటలో ఎవరికి వారు తమకంటూ ఒక ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. ఇక హీరోల సంగతి పక్కన పెడితే ఫైర్ అండ్ డేరింగ్ లేడి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ అందుకుందని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల తరువాత మంచు లక్ష్మీ ఎవరు ఊహించని విదంగా దర్శనమిచ్చింది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లుక్కుతో షాక్ ఇచ్చారనే చెప్పాలి.
నాలుగు పదుల వయసు దాటినా కూడా..
నాలుగు పదుల వయసు దాటినా కూడా మంచు లక్ష్మి గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నటిగా పలు కీలకమైన పాత్రలతో మెప్పించిన ఈ మల్టీ టాలెంటేడ్ ఉమెన్ నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించింది. ఇక మేము సైతం, లక్ష్మీ టాక్ షో అంటూ ఎన్నో మంచి కార్యక్రమాలతో క్రేజ్ అందుకుంది.
పుట్టినరోజున గ్లామర్ లుక్
నేడు మంచు లక్ష్మి 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు ఆభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ అందిస్తుండగా పుట్టినరోజున అమ్మడు గ్లామర్ లుక్ లో షాక్ ఇచ్చింది. మెరుస్తున్న పార్టీ డ్రెస్ లో లక్ష్మీ ఇచ్చిన లుక్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. మంచు లక్ష్మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఆ హీరోయిన్ తో కలిసి బర్త్ డే పార్టీ
గతంలో ఇలాంటి గ్లామర్ లుక్స్ లో చాలా సార్లు దర్శనమిచ్చినప్పటికి ఈ డ్రెస్ లో మాత్రం అంతకు మించిన గ్లామర్ ఉన్నట్లు నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే మంచు బ్రదర్స్ స్పెషల్ విషెస్ అందించారు. ఇక హీరోయిన్స్ రకుల్ తో కలిసి ఈ రోజు రాత్రి స్పెషల్ గా బర్త్ డే పార్టీని చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మరకత మాణిక్యం నా కూతురు
ఇక మోహన్ బాబు ఈ విదంగా విషెస్ అందించారు. నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైడూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్ళీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురిగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచబుతాల్ని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు. ఎన్ని జన్మలైనా నువ్వు నా కూతురిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా... లవ్యూ.. అంటూ మోహన్ బాబు వివరణ ఇచ్చారు.