రకుల్‌కు మంచు లక్ష్మీ గాఢమైన కౌగిలింత.. లవ్యూ అంటూ.. వీడియో వైరల్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహం గురించి అందరికి తెలిసిందే. ప్రతి ఒక్క నటులకు ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు. కానీ నటీమణుల్లో మాత్రం అలాంటి రిలేషన్స్ చాలాక్ తక్కువగా కనిపిస్తాయి. అలాంటి వారిలో మంచు లక్ష్మి , రకుల్ ప్రీత్ సింగ్ జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా అనేక రకాల హాలిడే ట్రిప్పులతో బిజీగా కనిపిస్తూ ఉంటారు.

వయసులో వ్యత్యాసం ఉన్నా..

వయసులో వ్యత్యాసం ఉన్నా..

ఇక నేడు రకుల్ పుట్టినరోజు కావడంతో గత రెండు రోజుల నుంచే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే మంచు లక్ష్మి ఈ నెల 8న తన పుట్టినరోజును జరుపుకుంది. ఇక ఇద్దరి వయసులో వ్యత్యాసం చాలానే ఉంది. మంచు లక్ష్మి 43లోకి అడుగుపెట్టగా ఈ రోజే రకుల్ మూడు పదుల వయసులోకి వచ్చేసింది. ఇక వీరిద్దరు వయసుతో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

రకుల్ కౌగిలింతలో మంచు లక్ష్మీ

రకుల్ కౌగిలింతలో మంచు లక్ష్మీ

పార్టీలు, జిమ్, హాలిడే ట్రిప్.. ఇలా ఎక్కడికెళ్లినా ఈ ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు విడువలేనంత క్లోజ్ గా ఉంటారని వారి సోషల్ మీడియా ఖాతాలను చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. రీసెంట్ గా రకుల్, మంచు లక్ష్మికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకుల్ మంచు లక్ష్మిని ఆప్యాయంగా వెనకనుంచి కౌగిలించుకుంది.

మంచు లక్ష్మి స్పెషల్ విషెస్

మంచు లక్ష్మి స్పెషల్ విషెస్

ఈ రోజు రకుల్ పుట్టినరోజు కావడంతో లక్ష్మీ తన బెస్ట్ ఫ్రెండ్ కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చిందట. రాత్రి వారి పార్టీలో హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇక మంచు లక్ష్మి ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ కూడా అందించింది. నిజాయితీ గల హార్డ్ వర్కర్, ఫన్, కేరింగ్, మ్యాడ్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్ డే మై లవ్. నువ్వు ఎవరి లైఫ్ ని టచ్ చేసినా హ్యాపీగా ఉంటారు.. అంటూ మంచి లక్ష్మీ వివరణ ఇచ్చింది.

చాలా హ్యాపీగా ఉన్నాను

చాలా హ్యాపీగా ఉన్నాను

లవ్యూ.. నువ్వు నాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా సోదరి. నా సోల్. చీర్స్ అంటూ.. రకుల్ ఆప్యాయంగా మంచు లక్ష్మికి సమాధానం ఇచ్చింది. ఇక వీరికి సంబంధించిన ఫొటోలతో నెటిజన్లు కూడా ఒకేసారి ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రకుల్ ప్రస్తుతం నితిన్ ఛెక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా మంచు లక్ష్మి ఒక టాక్ షో ద్వారా ఆడియెన్స్ ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X