అలా చేయకపోతే.. మహేశ్, నమ్రతాను కొడతా... మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మంచు లక్ష్మీప్రసన్న. బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో బుల్లితెరపై హోస్ట్‌గా, నిర్మాతగా పలు చిత్రాలను సైతం నిర్మించారు. ఇటీవల మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తగా... మంచు లక్ష్మీ ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చి అక్కడే ఉంటున్నారు. తాజాగా వరుస సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు లక్ష్మీ. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
జర్నలిస్ట్‌పై మంచు లక్ష్మీ ఫైర్
తండ్రిలాగే ముక్కుసూటితనంగా, మనసులో ఏదో దాచుకోకుండా మాట్లాడటంలో మంచు లక్ష్మీ ముందుంటరు. సోషల్ మీడియాలో ఎవరైనా తన జోలికి వస్తే తాట తీస్తారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన వయసు, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్‌పై యుద్దం చేశారు. ఇదే ప్రశ్న మీరు పెద్ద హీరోని అడగగలరా? అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా విషయం అక్కడితో వదిలిపెట్టకుండా ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సదరు జర్నలిస్ట్ దిగొచ్చి.. మంచు లక్ష్మీకి క్షమాపణలు చెప్పారు.

నేనూ లైంగిక వేధింపుల బాధితురాలినే
ఇక బోల్డ్ కామెంట్స్ చేయడానికి కూడా వెనుకాడని మంచు లక్ష్మీ.. పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయినే అయినా తాను కూడా లైంగిక వేధింపు వేధింపుల బాధితురాలినే అని బాంబు పేల్చారు. 15 ఏళ్ల వయసులో స్కూల్‌కి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనను ఆమె బయటపెట్టారు. ఒకసారి పదో తరగతి హాల్ టికెట్ల కోసం స్కూల్ యాజమాన్యం తమను పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడంతో ఏం చేయాలో తెలియక షాకయ్యా. ఆ సమయంలో కలిగిన భయం.. ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఒక సెలబ్రిటీ కుటుంబానికి చెందిన అమ్మాయికే ఇలా జరిగితే.. రోజూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే మహిళలు, యువతులకు ఎలాంటి పరిస్ధితులను ఎదుర్కొంటున్నారోనని మంచు లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.
మహేశ్, నమ్రతలను కొట్టేస్తా
ఇక తాజాగా సమాజంలో పితృస్వామ్యం, వారసత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మంచు లక్ష్మీప్రసన్న. పితృస్వామ్యాన్ని నిర్మూలించలేను.. కానీ దానిని ఛేదించి నా దారి నేను సృష్టించుకోవాలి. దక్షిణాదిలో చాలామంది నటులు.. తమ కుమార్తెలను లేదా సోదరీమణులను సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించడానికి వెనుకాడతారు. మగనటుల కుమార్తెలు తక్కువగానే తెరపై కనిపిస్తారు. ఉదాహరణకు మహేశ్ బాబు- నమ్రతల కుమార్తె సితార కూడా వయసుకొస్తోంది. సితార తనను తాను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి. నమ్రత ఆధునిక భావాలున్న మహిళ.. సితారకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి. లేదంటే మహేశ్, నమ్రతలను కొట్టేస్తానని లక్ష్మీ ప్రసన్న సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మహేశ్, నమ్రత స్పందించాల్సింది ఉంది.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో
మరోవైపు... సితార తల్లిదండ్రుల మాదిరిగానే స్టైల్‌కు ఐకాన్‌గా మారారు. అచ్చుగుద్దినట్లు మహేశ్‌ను దింపేసిన సితార ప్రస్తుతం పలు టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ కాబోతుండగా.. గౌతమ్, సితారలను ఎప్పుడు ఇండస్ట్రీకి తీసుకొస్తారు? అంటూ సూపర్‌స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











