స్కూల్ విద్యార్థినిపై నడి రోడ్డులోనే వేధింపులు.. పొలీస్ చేసిన పనికి మంచు లక్ష్మి సీరియస్ రియాక్షన్!
మహిళల కోసం ఎన్ని కొత్త తరహా చట్టాలు తీసుకు వస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయిన తర్వాత ఆ ఘటనలు త్వరగానే వెలుగులోకి రావడంతో తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా ప్రభుత్వాలు చర్యలు కూడా తీసుకుంటున్నాయి.
అయితే ఇటీవల నడిరోడ్డుపై ఒక పోలీస్ అధికారి ఒక స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వైరల్ అవుతున్న వీడియో పై మంచి లక్ష్మి కూడా సోషల్ మీడియాలో చాలా ఘాటుగా స్పందించింది. మధ్యప్రదేశ్లోని భోపాల్ లో రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళుతున్న ఒక స్కూల్ విద్యార్థిని పై ఓ పోలీసు అధికారి ఊహించిన విధంగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి తో మాట్లాడుతూనే తప్పుగా టచ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు.

ఇక ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా వదలకుండా పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు అందరికీ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అయితే అతనిపై ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ కూడా చేశారు. ఇక ఈ వీడియో వైరల్ అవుతూ ఉండడంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా తనదైన శైలిలో స్పందించింది.
ఇదివరకే చాలాసార్లు ఇలాంటి ఘటనలపై మంచు లక్ష్మి తన బావను వ్యక్తపరిచింది. ఇక ఇప్పుడు ఆ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరికు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఘటనను చూస్తూ ఉంటేనే రక్తం మరిగిపోతుంది అని ఆమె ఒక్క మాటతో తన కోపాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఫాలోవర్స్ మంచు లక్ష్మికి మద్దతు పలుకుతూ రియాక్ట్ అవుతున్నారు. పోలీసు అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక మిగిలిన వారు ఇంకా ఎంత దారుణంగా ఉంటారో అని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇక మంచు లక్ష్మి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











