twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్కూల్ ఫీజులపై డైరెక్టర్ క్రిష్ కౌంటర్.. నువ్వొచ్చి క్లాసులు చెప్తావా అంటూ మంచు లక్ష్మీ ఫైర్

    |

    సోషల్ మీడియాలో తెలుగు దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) ప్రస్తుత విద్యా వ్యవస్థపై ఊహించని విధంగా కామెంట్ చేశారు. సామాజిక అంశాల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేసే క్రిష్ అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే. అయితే మంచు లక్ష్మీ ఆయన చేసిన కామెంట్స్ కి కాస్త అసంతృప్తితో ఫైర్ అయినట్లు ట్వీట్ చేసింది.

    లాక్ డౌన్ ఎఫెక్ట్..

    లాక్ డౌన్ ఎఫెక్ట్..

    ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు చాలా వరకు మూత పడ్డాయి. పిల్లలకు యువతపై ఏ మాత్రం కరోనా ప్రభావం చూపినా అది దేశానికే డేంజర్ అని ప్రభుత్వాలు కూడా స్కూల్స్ ని మూసేశాయి. పరీక్షలు కూడా అవసరం లేదని కొన్నిటిని క్యాన్సిల్ చేయగా మరికొన్నిటిని వాయిదా వేశారు. ఇక అవకాశం ఉన్న ప్రయివేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు.

    బ్రిలియంట్ న్యూస్..

    బ్రిలియంట్ న్యూస్..

    అయితే ప్రస్తుతం 5వ తరగతి లోపు ఉన్న పిల్లలకు కర్ణాటకలో ఆన్​లైన్​లోక్లాసులు రద్దు చేయడంపై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ఒక ఆర్టికల్ పోస్ట్ చేస్తూ.. నిజంగా బ్రిలియంట్ న్యూస్.. ఇది నేషనల్ పాలిసి అవుతుందా? అధికమైన ఫీజుతో 2వ తరగతి విద్యార్థి కూడా ఆన్​లైన్ క్లాసులకు హాజరు అవుతున్నాడు అని రీసెంట్ గా విన్నాను.. అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు.

    నువ్వొచ్చి చెప్తావా..

    నువ్వొచ్చి చెప్తావా..

    ఆ విషయంపై మంచు లక్ష్మీ ఊహించని విధంగా స్పందించింది. ఆమె చేసిన ట్వీట్ చూస్తుంటే క్రిష్ కామెంట్స్ పై కాస్త ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆమె స్పందిస్తూ.. నువ్వొచ్చి చెప్తావా క్లాసెస్.. చెప్పు.. కనీసం కొన్ని గంటలైనా వారికి ఆన్​లైన్ క్లాసులు జరుగుతున్నాయి అని మంచు వారి అమ్మాయి వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది.

    బలవంతం చేయడం లేదు..

    అందుకు క్రిష్ సౌమ్యంగానే స్పందించాడు.. నేను దీన్ని తప్పనిసరి చేయడానికి వ్యతిరేకం.. మరియు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వారి సౌలభ్యం ప్రకారం ఎంచుకోవచ్చు అని వివరణ ఇవ్వగా.. మంచు లక్ష్మీ మరో కామెంట్ చేసింది.. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవటానికి ఎవరూ బలవంతం చేయడం లేదు .. ఇది ఒక్కటే మార్గం.. తీసుకోండి లేదా వదిలేయండి.. పాఠశాలలు కూడా కొత్త మార్గాన్ని గుర్తించడానికి చాలా కష్టపడుతున్నాయి .. ఇక తన కూతురు ఐప్యాడ్ ముందు గంటల తరబడి చూడటం నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంధోని లక్ష్మీ పేర్కొంది.

    English summary
    On social media, Telugu director Krrish (Radhakrishna Jagarlamoodi) unexpectedly commented on the current education system. Krish, who makes films with respect to social aspects, is an honor for everyone. But Manchu Lakshmi, however, tweeted that he was a bit displeased with his comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X