తండ్రి కోసం సింహాసనం.. ఆ మూడు సింహాలు ఎవరికి ప్రతీక అంటే.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్
టాలీవుడ్‌లోని పెద్ద కుటుంబాల్లో మంచువారిది ఒకటి. మోహన్ బాబు వారసత్వాన్ని పుణకిపుచ్చుకుని మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వీరి సినీ జీవితం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా సరే విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

మోహన్ బాబు బర్త్ డే వేడుకలు..
నిన్న (మార్చి 19) డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా నిన్న అంతా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు.

పెద్ద పండుగ..
మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మంచు మనోజ్ చేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఏడాదిలో ఎన్ని పండగలున్నా.. మాకు ఇదే పెద్ద పండుగన అని తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
సింహాసనం తయారుచేయించి..
మంచు మనోజ్ మాటలతో తన ప్రేమను చాటుకుంటే.. కూతురైన మంచు లక్ష్మీ తండ్రికి సింహాసనాన్ని తయారు చేయించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో, చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

ఆ మూడు సింహాలకు ప్రతీక..
మంచు లక్ష్మీ ఫోటోను షేర్ చేస్తూ.. "మా నాన్నకు కొత్త సింహాసనం. ఈ సింహాసనంలోని మూడు సింహాలు, మా ముగ్గురికీ నిదర్శనం. దీన్ని నేనే చేయించాను' అని కామెంట్ పెట్టింది. కాగా, ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 'సూరరైపోట్రు' (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











