అతని నెత్తిపైకి కాలు లేపిన మంచు లక్ష్మీ.. తంతే దెబ్బకు కింద పడిపోయింది.. కాస్త జాగ్రత్తగా ఉండండి

మంచు వారి వారసుల్లో హీరోలకంటే ఎక్కువగా కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాకు టచ్ లో ఉంటారని అందరికి తెలిసిన విషయమే. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎదో ఒక పోస్ట్ చేసే ఆమె నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలను ఎదుర్కొంటు ఉంటారు. మరికొన్ని సార్లు ట్రోలింగ్స్ ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ మంచు లక్ష్మి మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్ ఆమె పోస్ట్ చేసిన ఒక కిక్ వీడియో వైరల్ గా మారింది.

రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

 ఆ ఒక్క పాత్రతో..

ఆ ఒక్క పాత్రతో..

మంచు లక్ష్మి నిర్మాతగా నటిగా కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఆమె చేసిన రాక్షసి రోల్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినప్పటికి లక్ష్మీ చేసిన ఐరేంద్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

 మొదట ఆమె తన తమ్ముడితో..

మొదట ఆమె తన తమ్ముడితో..

ఇక మంచు లక్ష్మి నిర్మాతగా మారి సొంతంగా కొన్ని విభిన్నమైన సినిమాలను నిర్మించింది. మొదట ఆమె తన తమ్ముడితో నేను మీకు తెలుసా అనే సినిమాను నిర్మించారు. ఆ తరువాత ఝుమ్మంది నాథం, ఊ కొడతారా? ఉలిక్కిపడతారా?, గుండెల్లో గోదారి, దొంగాట వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించారు.

 నిర్మాతగా ఫెయిల్..

నిర్మాతగా ఫెయిల్..

నిర్మాతగా లక్ష్మీ 5 సినిమాలు చేయగా అందులో ఏది కూడా ఆమెకు అనుకున్నంత రేంజ్ లో లాభాలను అందించలేకపోయింది. ఇక సినిమా ప్రొడక్షన్ ను ఆమె దూరం పెట్టేశారు. కానీ టీవీ ప్రోగ్రాంలను సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్న లక్ష్మీ మంచి ప్రాఫిట్స్ ను అందుకున్నారు. యాంకర్ గా పలు ప్రోగ్రాంలతో ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నారు.

నాలుగు పదుల వయసులో కూడా

ఇక సోషల్ మీడియాలో వివిధ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తున్న మంచు లక్ష్మి అప్పుడప్పుడు కొన్ని ఊహించని ఫొటో షూట్స్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. గ్లామర్ గా కూడా ఫాలోవర్స్ కు షాక్ ఇస్తుంటారు. నాలుగు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జీగా కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేస్తుంటారు.

Recommended Video

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates
తన్నగానే కింద పడిపోయింది

తన్నగానే కింద పడిపోయింది

ఇక ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసిన మంచు లక్ష్మి దాదాపు ఆరడుగుల మనిషి నెత్తిపైన ఉన్న కిక్ ప్యాడ్ ను సునాయాసంగా తన్నేసింది. పైకి ఎగరకుండా ఒక కాలు లేపి తన్నగానే దెబ్బకు ఆ కిక్ ప్యాడ్ కింద పడిపోయింది. తన్నగానే ఏ మాత్రం అలుపు లేకుండా సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఇక మంచు లక్ష్మి ఫిట్నెస్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారో ఈ వీడియోతో మరో క్లారిటీ వచ్చేసింది. అలాగే ఆమెపై ట్రోలింగ్ చేసేవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X