హగ్గులు, ముద్దులు పంపిస్తున్నా.. రామ్ చరణ్‌పై మంచు లక్ష్మీ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 27) సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఫ్యాన్స్ చేసిన హంగామాతో రామ్ చరణ్ బర్త్ డే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
మొట్టమొదటిగా ఒక రోజు ముందే రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి. చరణ్ పుట్టిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఎన్టీఆర్, అఖిల్, వరుణ్ తేజ్, నిహారిక సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా అందరూ రామ్ చరణ్‌కు విషెస్ తెలిపారు.

తాజాగా మంచు లక్ష్మీ సైతం రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. అంతకుమందే మంచు మనోజ్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. క్వారంటైన్ వల్ల కలుసుకోలేకపోతోన్నామ కదా.. అందుకే ఇలా హగ్గులు, ముద్దులు పంపిస్తున్నానన్నట్టుగా ఓ ట్వీట్ చేసింది. త్వరలోనే కలిసి పార్టీ చేసుకుందామని తెలిపింది.


Click it and Unblock the Notifications











