Manchu Lakshmi New Movie: ఫస్ట్ లుక్ అదరగొట్టిన మంచు అక్క.. ఈ పోస్టర్ ఏ సినిమాదో తెలుసా?
Manchu Lakshmi New Movie: మంచు లక్ష్మీ.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు కూతురిగా సినిమాల్లో అడుగు పెట్టిన ఈమె... బహుముఖ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈమె అందం, అభినయానికే కాదు.. మాటలకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది.
అయితే ఈరోజు మంచు లక్ష్మీ తన 46వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగానే ఆమె అభిమానలకు ఓ అదిరిపోయే న్యూస్ చెప్పారు. తాను ఓ అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఆదిపర్వం అనే టైటిల్ తో మంచు లక్ష్మీ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

మాస్ మహారాణిలా మంచు అక్క: ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు బ్లౌజులో మాస్ మహారాణిలా ఉన్న మంచు లక్ష్మీ లుక్ చూస్తే ఎవరైనా అబ్బా అనాల్సిందే. అయితే సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్, అమెరికా ఇంటియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఆదిపర్వం సినిమా టైటిల్ కు ఓ ట్యాగ్ లైన్ కూడా ఉంది. అదేంటంటే.. ఎర్రగుడి కథ. ఈ ట్యాగ్ లైన్ చూస్తేనే ఇదేదో సోషియో ఫాంటసీ సినిమా అని అర్థం అయిపోతుంది. ఆదిపర్వం అనేది 1974 నుంచి 1990 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారట. ఇదొక పీరియాడికల్ డ్రామా అని సమాచారం.
2009లో అనుష్క హీరోయిన్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రం అరుంధతీ తరహాలోనే ఈ సినిమా ఉంటుందట. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అయిన ఈ సినిమాలో మంచు లక్ష్మీ యాక్టింగ్ ఇరగదీయడం ఖాయం. ఎర్రగుడి దేవత కథతో నడిచే ఈ సినిమాలో అందమైన ప్రేమకథను కూడా చూపించబోతున్నారట డైరెక్టర్. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా మెండుగానే ఉండనున్నాయట.
మంచులక్ష్మీ కెరియర్ లోనే ఈ చిత్రం ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. మంచులక్ష్మీ ఈ సినిమాలో మీరెప్పుడూ చూడని యాంగిల్ లో కనిపిస్తుందని అన్నారు. మంచు లక్ష్మీ చేసిన రెండు ఫైట్ సీన్లు సినిమాకు ప్రధాన హైలెట్లుగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆదిపర్వం సినిమాఆహ్లాదకరమైన రెట్రో వైబ్స్‌తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రారంభమై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోందన్నారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటీ ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించాలని చెప్పుకొచ్చారు. ఆదిపర్వంలో టాప్ క్లాస్ గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తాయని సహ నిర్మాతలిద్దరూ చెప్పారు.
అయితే ఈ సినిమాలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజితా ఘోష్, శివ కాంతమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి, మధు నంబియార్, బృందా, స్నేహ అజిత్, అయేషా, జ్యోతి, శ్రావణి , రామకృష్ణ, రాధాకృష్ణలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట.


Click it and Unblock the Notifications











