అహం బ్రహ్మాస్మి అప్‌డేట్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత ఓ చిత్రాన్ని ప్రకటించాడు. చివరగా ఒక్కడు మిగిలాడు చిత్రంతో పలకరించగా నిరాశే ఎదురైంది. ఆపై వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరం ఉంటూ వచ్చాడు. భార్య ప్రణీతతో విడాకుల అనంతరం సినిమా జీవితంపై ఫోకస్ పెట్టాడు. విడాకులతో తమ బంధం ముగిసిందని, ఇక తన జీవితమంతా సినిమాలకే అంకితమని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.

అంతేకాకుండా మంచు మనోజ్ ఆర్ట్స్ అంటూ ఓ బ్యానర్‌ను స్థాపించి.. చిత్రాలను నిర్మిస్తానని ప్రకటించాడు. అందులో భాగంగానే అహం బ్రహ్మాస్మి ప్రాజెక్ట్ రాబోతోందని ప్రకటించాడు. ఐదు భాషల్లో జాతీయ చిత్రంగా అత్యంత భారీ ఎత్తున నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ పోస్టర్ ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.

Manchu Manoj Aham Brahmasmi First Look On 4th March

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'అహం బ్రహ్మాస్మి టైటిల్ పోస్టర్‌కు మీరిచ్చిన రెస్పాన్స్‌కు ధన్యవాదాలు. ఇక రేపు ఫస్ట్ లుక్ వస్తుంది..నేను ఇప్పుడు ఇంత కంటే ఎక్కువగా ఏమీ మాట్లడను.. ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్కే అంతా మాట్లాడుతుంద'ని ట్వీట్ చేశాడు. తాజాగా మరో ట్వీట్ చేస్తూ.. నేటి సాయంత్రం 5 22 గంటలకు ఫస్ట్ లుక్ రాబోతోందని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X