అహం బ్రహ్మాస్మి ఫస్ట్ లుక్.. మూడు రూపాల్లో మంచు మనోజ్
మంచు మనోజ్ మంచి నటుడన్న సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకున్నాడు. ఒకే రకమైన జానర్‌కు పరిమితం కాకుండా మొదటి నుంచి విభిన్న ప్రయోగాలను చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్.. అహం బ్రహ్మాస్మితో ముందుకు వస్తున్నాడు.
భార్య ప్రణీతతో విడాకుల అనంతరం సినిమా జీవితంపై ఫోకస్ పెట్టాడు. విడాకులతో తమ బంధం ముగిసిందని, ఇక తన జీవితమంతా సినిమాలకే అంకితమని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అంతేకాకుండా మంచు మనోజ్ ఆర్ట్స్ అంటూ ఓ బ్యానర్‌ను స్థాపించి.. చిత్రాలను నిర్మిస్తానని ప్రకటించాడు. అందులో భాగంగానే అహం బ్రహ్మాస్మి ప్రాజెక్ట్ రాబోతోందని ప్రకటించాడు.

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. మూడు రూపాల్లో మంచు మనోజ్ అదిరిపోయేలా ఉన్నాడు. మూడు రకాల వేరియేషన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచు మనోజ్ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఫస్ట్ లుక్‌పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నార. రానా, సందీప్ కిషన్, అల్లరి నరేష్ వంటి ఫస్ట్ లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











