Manchu Manoj: మంచు మనోజ్, భూమా మౌనికల కూతురు వీడియో వైరల్.. మీరూ చాశారా?
మంచు మనోజ్ గురించి, ఆయన భార్య భూమా మౌనిక గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు హీరో, మరొకరు రాజకీయ కుటుంబానికి చెందిన వారు కాగా వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ మంచు మౌనికకు తన మొదటి భర్త ద్వారా ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు వీరి కుటుంబంలో మరో మహాలక్ష్మి వచ్చింది. నిన్ననే భూమా మౌనిక ఓ పండంటి ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. అయితే తాజాగా ఆ పాప వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు ఇద్దరికీ గతంలో పెళ్లిళ్లు అయ్యాయి. పలు కారణాలు వల్ల వాళ్లు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించారు. అయితే ముందు నుంచే మౌనిక, మనోజ్ ల మధ్య స్నేహం ఉండగా.. విడాకుల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా చాలా ఏళ్ల పాటు వీరు ప్రేమను కొనసాగించారు. కానీ మంచు కుటుంబ వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే చాలా కాలం వీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. కానీ గతేడాదే మంచు లక్ష్మీయే దగ్గరుండి వీరిద్దరి పెళ్లి జరిపించింది. ముఖ్యంగా ఇరుకుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లి అయిన తర్వాత నుంచి వారిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. మంచు మౌనిక కొడుకును మనోజ్.. తన కొడుకుగా భావిస్తున్నట్లు చెప్పాడు. శివుడికి వినాయకుడు దొరికినట్లుగా తనకు ధైరవ్ దొరికాడని కూడా చెప్పుకొచ్చాడు. ఎక్కడికి వెళ్లినా వీరు ముగ్గురూ కలిసే వెళ్లగా.. చాలా రోజుల క్రితం మౌనిక గర్భం దాల్చినట్లు చెప్పాడు మనోజ్. అయితే ఏప్రిల్ 13వ తేదీన మంచు లక్ష్మి తనకు మేనకోడలు పుట్టిందని.. ఆమెను అంతా ప్రేమగా ఎం.ఎం పులి అని పిలుచుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా ఈ పాపకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా మంచు మనోజ్, భూమా మౌనిక.. వాళ్ల కొడుకు ధైరవ్ రెడ్డి.. బుజ్జి పాపాయి ఇంటికి చేరుకున్నారు. వీరిని చూసేందుకు చాలా మంది వారి ఇంటి వద్దకు రాగా.. కారులోంచి దిగిన ఈ జంట ఇంట్లోకి అడుగు పెట్టారు. అయితే పాపాయికి ఘనంగా స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు... దిష్టి కూడా తీసి లోపలికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. హ్యాపీగా జీవించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ విడియో చూసేయండి.


Click it and Unblock the Notifications











