2011 ఘటన.. చిరంజీవి, చరణ్ కు క్షమాపణలు చెప్పిన మనోజ్.. ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవికి దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగు స్టేట్స్ లో మాత్రం మాగ్జిమమ్ చిరంజీవికి అందరూ అభిమానులే. స్వయం కృషితో చిరు ఎదిగిన తీరును ఇప్పటికీ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన ఘన కీర్తిని పొగుడుతూనే ఉంటారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. అంతకంతకు ఎదుగుతున్నాడు. అయితే వీరిపై గతంలో జరిగిన ఒక పొరపాటు వల్ల టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే...
మళ్లీ ఫామ్ లోకి మంచు మనోజ్ కెరీయర్..
అగ్ర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మంచు మనోజ్ మాత్రం తన టాలెంట్ తోనే ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్నారు. తండ్రి మోహన్ బాబు పేరు నిలబెట్టే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే బిందాస్, నేను మీకు తెలుసా, కరెంట్ తీగ, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, శౌర్య, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి సినిమాలతో అలరించాడు. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్లీ తన కెరీయర్ ను గాడీలో పెట్టుకొని వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసుకుందుకు రెడీ అవుతున్నాడు.

భైరవంతో మొదలెట్టిన మనోజ్..
చివరిగా ఒక్కడు మిగిలాడు అనే చిత్రంతో 2017లో హీరోగా వెండితెరపై అలరించాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తన పెళ్లి, కరోనా వంటి కారణాల వల్ల సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చాడు. చిన్న చిన్న క్యామియో రోల్స్ లో తప్ప డైరెక్ట్ గా సినిమాలు తీసుకు రాలేదు. ఇక ఇప్పుడు భైరవం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం మే 30న గ్రాండ్ గా విడుదల కానుంది. కాబట్టి ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ సినిమా గురించి మాట్లాడుతూనే.. తాజాగా మెగా అభిమానుల గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లకు క్షమాపణలు చెప్పారు.
చిరు, రామ్ చరణ్ లకు మనోజ్ క్షమాపణలు..
కంటెంట్ ఉన్న సినిమాలను అందరి స్టార్ హీరోల అభిమానులు, ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని హిట్ చేస్తున్నారని మనోజ్ అన్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాను కూడా ఆదరించాలన్నారు. ముఖ్యంగా మెగా అభిమానుల ప్రోత్సాహం ఉండాలని, భైరవం దర్శకుడు విజయ్ మెగా అభిమాని చెప్పారు. కానీ గతంలో ఒక పోస్టర్ రాంగ్ గా వెళ్లిందని, దానికి హార్ట్ అయిన ప్రతి ఒక్క మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులకు టీమ్ తరుపున తను క్షమాపణలను చెబుతున్నానని చెప్పారు. అందరి ఆశీస్సులతో సినిమాను బతికించాలని కోరారు.
గతంలో ఏం జరిగింది..
భైరవం.. దర్శకుడు విజయ్ కనకమేడల సోషల్ మీడియా అకౌంట్ నుంచి 2011లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ఉన్న ఒక పోస్టర్ విడుదలైంది. అది హిందీ ఫిల్మ్ 'పా' పోస్టర్ లా డిజైన్ చేసి కాస్తా మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేలా ఉండింది. దాంతో విజయ్ అప్పట్లో కాస్తా ట్రోల్ కు గురయ్యాడు. ఇక ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన చిత్రం 'భైరవం' విడుదల కాబోతుండటంతో మెగా అభిమానులు ఆయన సినిమాపై చిర్రెత్తిపోతున్నారు. దాంతో మే 22న బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అసలు అది తన అకౌంట్ కాదని, అది హ్యాక్ అయ్యి ఉంటుందని, అలాంటి తప్పు చేయలేనని, తనను తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పారు. తనూ మెగా అభిమానినేనని, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేశానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని మరోసారి మనోజ్ కూడా గుర్తు చేసి మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.


Click it and Unblock the Notifications











