రామ్ చరణ్, చిరంజీవిపై మంచు మనోజ్ కామెంట్.. వెంటనే వెళ్లి చూడండంటూ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంటోంది. అన్ని థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి కనిపిస్తోంది. మొదటి షోతోనే భారీ బ్లాక్ బస్టర్ అని నిరూపించుకుంది సైరా. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సైరా నరసింహా రెడ్డి టీమ్‌ని అభినందిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
సైరా బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సైరా టీమ్ మొత్తానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు అని ట్వీట్ లో పేర్కొన్నాడు మంచు మనోజ్. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడిగా మన మెగాస్టార్ కనువిందు చేశారని తెలిపాడు. వెంటనే వెళ్లి మీ దగ్గర లోని థియేటర్స్ లో సైరా చూసేయండి అంటూ సందేశమిచ్చాడు మనోజ్. అయాన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


Click it and Unblock the Notifications











