కట్టుబట్టలతో గెంటేశారు..తండ్రి మోహన్ బాబుపై మనోజ్..వేదికపైనే కన్నీళ్లు

మంచు మోహన్ బాబు వారసుడిగా మంచు మనోజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి అందరికీ తెలిసిందే. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కానీ ఎవరి దిష్టి తగిలిందో కానీ ఇప్పుడు మంచు మనోజ్ ఆ తండ్రికే దూరం అయ్యాడు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా గొడవలు, ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటలు జారుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా మంచు మనోజ్ తన తండ్రి మంచు మోహన్ బాబు గురించి మాట్లాడుతూ భావోద్వేగం అయ్యారు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ తన అభిమానులతో ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు.

మంచు ఫ్యామిలీలో గొడవలు..
మంచు మనోజ్ అఖిలను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన పెళ్లితో మంచు అభిమానులు అందరూ సంతోషించారు. కానీ వీరిద్దరి పెళ్లి తర్వాత నుంచి ఆ ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు నుంచే అంతర్గతంగా ఘర్షణలు అవుతూనే ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల అయితే ఏకంగా బహిరంగంగానే మనోజ్ తన తండ్రి మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ మధ్య పరస్పరం కేసులు కూడా నమోదయ్యాయి. ఇక మోహన్ బాబు కూడా క్షణికావేశంలో మనోజ్ ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్టు కూడా తానే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. అలా సమస్య సర్దుమణిగింది అనుకునే లోపే మరో సమస్య ఉత్పన్నమవుతోంది.

Manchu Manoj Emotional Comments about his father Manchu Mohan Babu

కలిసిపోతారనుకుంటే.. ఇంకా దూరమవుతూ..
మంచు మోహన్ బాబు కుటుంటం ఎప్పటికీ త్వరగా కలిసిపోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. మళ్లీ ఆ కుటుంబాన్ని ఆనందంగా చూడాలని ఆశిస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎవ్వరూ తగ్గకపోవడంతో వారి సమస్యలు ఎప్పుడూ సర్దుమణుగుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలతో వారి మధ్య ఇంకా దూరం పెరుగుతూనే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా మనోజ్ కామెంట్స్ కూడా నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి.

9 ఏళ్లుగా దూరం.. అయినా ఆదుకున్నారు..
మంచు మనోజ్ తాజాగా తన రాబోయే చిత్రం భైరవం ఈవెంట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఎప్పుడో తీసిన సినిమాలను గుర్తుంచుకొని మరీ అభిమానులు ఆదరిస్తున్నారని చెప్పారు. బిందాస్, నేను మీకు తెలుసా?, కరెంట్ తీగ వంటి సినిమాలు తప్ప నేను మీకు 9 ఏళ్లుగా ఏమీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కానీ తనను కట్టబట్టలతో ఇంట్లో నుంచి గెంటేస్తే మాత్రం తన కోసం అభిమానులు 20 కార్లతో వచ్చి సేఫ్ గా తీసుకెళ్లారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని మనోజ్ భావోద్వేగమయ్యారు.

Take a Poll

తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ..
భైరవం ఈవెంట్లోలోనే మంచు మనోజ్ మరోసారి తన ఫ్యామిలీ గొడవలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు గురించి ఇలా మాట్లాడారు. ఎవరెన్ని చెప్పినా.. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన తండ్రి మంచు మోహన్ బాబే అని, ఈ కట్టె కాలే వరకు తను మంచు మోహన్ బాబు కొడుకునేనని, దాన్ని ఎవరూ మార్చలేరని భావోద్వేగమవుతూ చెప్పారు. వేదికపైనే మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని మళ్లించింది.

More from Filmibeat

Read more about: manchu manoj manchu mohan babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X