మంచు ఫ్యామిలీలో ఆమె వల్లే గొడవలు.. క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్

మంచు మనోజ్ తన ఫ్యామిలీ గొడవలపై మరోసారి స్పందించారు. కొన్నాళ్లుగా మంచు వారి ఇంట్లో తలెత్తుతున్న పరస్పర గొడవలకు కారణం ఆమె అంటూ ప్రచారంలో ఉండగా.. తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. తన సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.

మనోజ్ నెక్ట్స్ సినిమా..
ఏడేనిమిదేళ్లుగా మంచు మనోజ్ వెండితెరపై కనిపించడం లేదు. కరోనాకు ముందు వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. దాదాపు ఆయన కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేసి 9 ఏళ్లు దాటిందని తానే రీసెంట్ గా బహిరంగంగా ప్రకటించారు. అయితే మనోజ్ ప్రస్తుతం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చివరిగా 'ఇది నా లవ్ స్టోరీ', 'ఆపరేషన్ 2019' వంటి చిత్రాల్లో మెరిశారు. ఇక ప్రస్తుతం 'మిరాయ్', 'భైరవం' వంటి చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాల్లో కీలక పాత్రల ద్వారా అలరించబోతుండటం గమనార్హం.

Manchu Manoj Gave Clarity on his Family Issues he supported his wife Mounika

భైరవంతో మనోజ్ ఛాలెంజ్..
మంచు మనోజ్ నుంచి నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం భైరవం. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు. యాక్షన్ డ్రామాను విజయ్ కనకమెడల డైరెక్ట్ చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసినిమాతో తన కీలక పాత్ర ద్వారా ఎలాగైనా కంబ్యాక్ ఇస్తానని మనోజ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను దగ్గరుండి బాగా ప్రమోట్ చేస్తున్నారు.

కుటుంబ గొడవలపై క్లారిటీ..
మంచు కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మనోజ్, ఆయన తండ్రి మోహన్ బాబు మధ్య తరుచుగా గొడవలు అవుతున్నాయి. ఒకరిపై ఒకరూ విమర్శలు, పరస్సర కేసులు కూడా నమోదు చేసుకుంటూ కనిపించారు. అయితే ఈ గొడవలన్నింటికీ తన భార్య మౌనికనే అంటూ ఆ మధ్యలో పుకార్లు వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే అని పలువురు ప్రచారం చేశారు. కానీ అవన్నీ అబద్ధమని తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఆమెకు గొడవలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఒక్కటే డిమాండ్..
మంచు ఫ్యామిలీ గొడవలపై ఇటీవల మనోజ్ వరుసగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే తన నుంచి రాబోతున్న చిత్రం 'భైరవం' ఈవెంట్ లో తండ్రి మోహన్ బాబు తనపై ఎంత కఠినంగా వ్యవహిరించారో ఘటనతో పాటుగా వివరించారు. అయినా తనకు తన కుటుంబం కావాలని, మంచు మోహన్ బాబే తన తండ్రి అనేది ఎప్పటికీ చెరపలేనిదని చెబుతున్నారు. ఇక తాజా ఇంటర్వ్యూలో కూడా మనోజ్ తన కుటుంబంతో గొడవలు సర్దుమణగాలనే చూస్తున్నానని, కానీ ఏదోక నిందారోపణ వల్ల మళ్లీ మొదటి వస్తోందన్నారు. తన సైడ్ ఎంతో ఓపిగ్గా ఉన్నాని, కొన్నేళ్లుగా అన్నీ వింటూ భరిస్తూ సహిస్తూ ఉన్నాడని, అంత సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా రోడ్డెక్కాలంటే ఎంతలా బాధపడి ఉంటానో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తి అడిగినట్టుగా, మరే ఇతర తప్పిదాలు చేసినట్టుగా సీసీ టీవీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాలు ఉంటే చూపించి తనను తప్పు చేయాలని డిమాండ్ చేశారు. గొడవలు మొదటి నుంచే ఉన్నాయని, కానీ ఎప్పటికైనా, ఏదేమైనా తన కుటుంబం తనకు కావాలని కోరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X