మళ్లీ పెళ్లా.. వామ్మో అంటోన్న మంచు వారబ్బాయి

తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా మాట్లాడటం మోహన్ బాబు నైజం. క్రమశిక్షణ పేరిట హింసిస్తాడని అందరూ ప్రేమగా ఫిర్యాదు చేస్తుంటారు. ఆయన వారసత్వంగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీలు తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నారు.

అయితే తాజాగా మంచు మనోజ్ మాత్రం.. తన భార్యకు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇద్దరం ఓ అంగీకారానికి వచ్చే విడాకులు తీసుకుంటున్నామని, కలిసి బతకలేనప్పుడు విడిపోయి స్నేహితుల్లా ఉండాలంటూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అయితే తదనంతరం సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.

 Manchu Manoj Interesting Tweet About Marrigae

తాజాగా మనోజ్ చేసిన ఓ ట్వీట్సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫైర్‌బాల్‌లా మీ ముందుకు రాబోతున్నా. వారం రోజుల్లో మీకు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నా. వెయిట్‌ చెయ్యండి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఒక అభిమాని ఏంటి? మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మనోజ్ వామ్మో.. అని రిప్లై ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X