twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీవారి ఆస్తులను అమ్మమని దేవుడు చెప్పాడా? జవాబు చెప్పండి.. మంచు మనోజ్ ప్రశ్నల వర్షం

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులను అమ్మాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత వివాదంగా మారుతున్నది. కలియుగ పుణ్యక్షేత్రంగా భావించే శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆస్తులను వేలానికి పెట్టడంపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉండే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ హీరో మంచు మనోజ్ కొన్ని ప్రశ్నలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకు మంచు మనోజ్ ఏమన్నారంటే..

    Recommended Video

    Manchu Manoj Questions TTD On Selling Lord Balaji Properties
    దేవుడేమైనా చెప్పాడా?

    దేవుడేమైనా చెప్పాడా?

    మంచు మనోజ్ పేరిట విడుదలైన ప్రకటన ప్రకారం.. టీటీడీ ఆస్తులను అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? కరోనా సంక్షోభంలో రోజుకు లక్షమందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది. చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకు వచ్చిన లక్షలాది మందిని, సుప్రబాత సేవకి టైమ్ అయిందని నిద్ర లేవాలి అని శ్రీవారిని సైతం కంట్రోల్ చేసిది టీటీడీ పాలక మండలి అంటూ ప్రకటనలో పేర్కొన్నాడు.

    గోవిందా గోవిందా అంటూ అరచిన ఈ గొంతు

    గోవిందా గోవిందా అంటూ అరచిన ఈ గొంతు

    ఏడుకొండలపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గోవిందా గోవిందా అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది. మోసం జరగట్లేదని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముంద అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు అని మంచు మనోజ్ అన్నారు.

    ఎందుకు అమ్ముతున్నారు?

    ఎందుకు అమ్ముతున్నారు?

    అయితే శ్రీవారికి చెందిన భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అమ్ముతున్నారు అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే కావాలి అని మంచు మనోజ్ తనదైన శైలిలో స్పందించారు.

    తిరుపతి వాడిగా ఆపుకోలేక

    టీటీడీలో భక్తులకు అనుబంధం ప్రత్యేకమైనది. అందుకే ఏమీ లేదు సార. ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉందని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నాను సార్.. అంతే జైహింద్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    English summary
    #AndhraPradesh govt has issued proceedings to dispose off the properties of #TTD become contraversy. In this occassion, Manchu Manoj questions TTD's decision to sell lord Balaji assets. He said, as devotee of lord balaji, I have been shocked by his decision. TTD need to give answer to my questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X