కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనం.. స్పందించిన మనోజ్.. ఏమన్నారంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప. మైథాలాజికల్, భారీ విజువల్స్, భారీ కాస్టింగ్ తో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. పోయిన నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల కాస్తా ఆలస్యమైంది. కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై తాజాగా మంచు మనోజ్ కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది..

భారీ స్థాయిలో కన్నప్ప సినిమా..
మంచు ఫ్యామిలీలోనే ఇప్పటికీ రానటువంటి రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. పైగా భక్త కన్నప్ప పై వస్తున్న ఫాంటసీ ఫిల్మ్ కావడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ముకేష్ నకుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు రూ.200 కోట్లు వెచ్చించి నిర్మించారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కామియో అప్పీయరెన్స్ ఇవ్వబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Manchu Manoj Reacted on Kannappa Movie Hard Disk Missing

కన్నప్ప హార్డ్ ఎలా మిస్సైంది..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ముంబైలోని ఓ ప్రముఖ సంస్థలో వీఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తోంది. అయితే మే27న వర్క్ పూర్తైన వెంటనే ఆ హార్డ్ డిస్క్ ముంబై నుంచి రఘు అనే పర్సన్ చరితకు ఇచ్చాడంట. ఇప్పుడు వీళ్లు ఇద్దరూ కనిపించడం లేదు. వారిద్దరిపైనా పోలీసులకు ఫిదా చేశారు. కేసు నమోదైంది. దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే హార్డ్ డిస్క్ ఎలా పోయిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

మనోజ్ పైన అనుమానం.. ఆయన రిప్లై ఇదే..
మంచు మనోజ్ ప్రస్తుతం 'భైరవం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 30న ఆ చిత్రం విడుదలైంది. అయితే మనోజ్ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయ్యారు. అంతకు ముందు మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అవన్నీ సర్దుమణిగి అందరూ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగలించడంపై పలువురు మనోజ్ పై అనువానం వ్యక్తం చేశారు. అయితే దానిపై తాజాగా మనోజ్ స్పందించారు... ఒక సినిమా ఎంతోమంది కష్టపడి తీసేది. ఆ కష్టం తనకు తెలుసునని, ఒకప్పుడు కాస్తా అల్లరి పనులు చేసేది కానీ.. ఇలాంటి విషయాల్లో నన్ను అనుమానించడం సరికాదని, నన్ను రెచ్చగొట్టడం కూడా సరికాదని బదులిచ్చాడు. కానీ కన్నప్ప సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ప్రమోషన్స్ మాత్రం జోరుగా..
కన్నప్ప టీమ్ హార్డ్ డిస్క్ పోయినా కూడా ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాలను ఆపడం లేదు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా భారీ ఈవెంట్ నిర్వహించి శివరాజ్ కుమార్ గెస్ట్ గా ప్రచారం చేశారు.

More from Filmibeat

Read more about: manchu manoj kannappa prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X