మిత్రమా రామ్ చరణ్.. వేచి చూడలేకున్నా: మంచు మనోజ్ ట్వీట్
'ఖైదీ నెంబర్ 150' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ వీడియోకు కొద్ది సమయంలోనే విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది సమయంలోనే భారీ స్థాయిలో వ్యూస్ సంపాదించింది. మిగిలిన సామాజిక మాధ్యమాలు అన్నీ కలిపి మొత్తంగా డిజిటల్ వ్యూస్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది 15 మిలియన్ వ్యూస్ సాధించింది.

దీంతో ఈ టీజర్‌పై సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ టీజర్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇక, మంచు మనోజ్ కూడా దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'మిత్రమా రాంచరణ్.. నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదుర్స్. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్. గూస్‌బమ్స్ వచ్చాయి. మెగాస్టార్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూడలేకున్నా. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.


Click it and Unblock the Notifications











