మంచు మనోజ్ ప్రశ్చాత్తాపం.. సందీప్ రెడ్డి వంగాకే నో చెప్పాడంట.. ఏ సినిమానో తెలుసా?

మంచు మనోజ్ ప్రస్తుతం మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఆయన నటించిన సినిమా భైరవం ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. కాగా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మనోజ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కెరీయర్ లో వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాను వదులుకున్నానని బాధపడ్డాడు. అది కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ సినిమా కావడంతో ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వివరాలను తెలియజేశాడు.

మంచు విష్ణుకు సందీప్ రెడ్డి వంగా ఆఫర్..
మంచు మోహన్ బాబు తనయుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మంచు మనోజ్. తన నటనతో ఆడియెన్స్ ను మెప్పించాడు. రాజు బాయ్, బిందాస్, నేను మీకు తెలుసా, వేదం, జుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, గుంటూరోడు, కరెంట్ తీగ, వంటి చిత్రాలతో అలరించాడు. అయితే మంచు మనోజ్ కు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసే అవకాశం దక్కిందంట. కానీ మంచు మనోజ్ మాత్రం అప్పటికే తను కమిట్ అయ్యి ఉన్న సినిమాల బిజీ కారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాకు నో చెప్పారంట. ఆ విషయాన్ని తాజాగా మంచు మనోజ్ తన ఇంటర్వ్యూల్లో రివీల్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.

Manchu Manoj regrets missing out on a film offer from Sandeep Reddy Vanga

మనోజ్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ..
మంచు మనోజ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రావాల్సిన చిత్రం మరేంటో కాదు... రౌడీ హీరో విజయ్ దేవరకొండ - షాలినీ పాండే కలిసి నటించిన అర్జున్ రెడ్డినే కావడం విశేషం. ఈ సినిమాను విజయ్ దేవరకొండ కంటే ముందుగా సందీప్ రెడ్డి వంగ మనోజ్ తో చేయాలని భావించారంట. కానీ 2016, 2017, 2018 వరకు సినిమాల ఫుల్ బిజీగా ఉండటంతో ఆ సినిమా చేయలేకపోయానని తెలిపారు. అంతే కాదు అప్పుడు ఆ సినిమా మిస్ అయ్యినందుకు ఇప్పుడు ప్రశ్చాత్తాపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక అర్జున్ రెడ్డి 2017లో విడుదలై తెలుగు స్టేట్స్ లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత హిందీ, తమిళంలోనూ రీమేక్ అయ్యింది. అప్పుడు మనోజ్ ఆ సినిమా చేసి ఉంటే.. ఇప్పుడు కెరీయర్ గ్రాఫ్ ఎక్కడో ఉండేదని అంటున్నారు.

మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తాజాగా నటించిన చిత్రం 'భైరవం'. తమిళ చిత్రానికి రీమేక్ గా రూపుదిద్దుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అదితి శంకర్ జంటగా నటించారు. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. మే 30న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.

నెక్ట్స్ సినిమాలివే..
మంచు మనోజ్ ప్రస్తుతం తన కెరీయర్ పైనే ఫోకస్ పెట్టారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన లైనప్ లో 'మిరాయి', రక్షక్, వాట్ ద ఫిష్ అనే చిత్రాలు ఉన్నాయి. విభిన్న కథలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X