నేను చనిపోయాననుకున్న.. మంచు మనోజ్ లైఫ్ రిస్క్ స్టంట్.. ఏమైందంటే?
మంచు మోహన్ మనోజ్ చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. తాజాగా మనోజ్ 'భైరవం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో మనోజ్ కీలక పాత్రలో అలరించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను మనోజ్ ముందుండి నడించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తన కెరీయర్ లో జరిగిన ఓ భయంకరమైన ప్రమాదాన్ని గురించి తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. చావుదాకా వెళ్లి తిరిగి వచ్చిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళితే..
8 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి..
మంచు మనోజ్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా ఎనిమిదేళ్ల పాటు కొత్త సినిమాలు చేయకపోవడం గమనార్హం. తన వ్యక్తిగత సమస్యలతో ఇన్నాళ్లు తన అభిమానులకు కాస్తా దూరంగా ఉన్నారు. కానీ తాజాగా మే 30న మాత్రం 'భైరవం' చిత్రంతో వెండితెరపై మెరిశారు. తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో దుమ్ములేపారు.

మంచు మనోజ్ వరుస ఇంటర్వ్యూలు..
'భైరవం'.. సినిమాకు మంచు మనోజ్ గట్టి ప్రమోషన్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి బజ్ క్రియేట్ చేసేందుకు జోరుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కువ శాతం మనోజ్ ప్రచార కార్యక్రమాలు, ఈవెంట్లలో మాట్లాడుతూ వచ్చారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంగా మనోజ్ తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ గొడవలపైనా స్పందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాత్రం తన జీవితంలో జరిగిన అది భయంకరమైన ఘటన, మళ్లీ ఎప్పుడు చేయబోని ఆ స్టంట్ గురించి బయట పెట్టడం హాట్ టాపిక్ గ్గా మారింది.
మెడ విరిగిన శబ్ధం.. మూడు నెలలు రెస్ట్..
మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య అనే చిత్రంలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఒక స్టంట్ చేసే సమయంలో ప్రాణాలు కోల్పోయే దాకా పరిస్థితి వచ్చిందని చెప్పారు. మిస్టర్ నూకయ్య సినిమాలో ఒక కారు స్టంట్ చేసే సమయంలో ప్రమాదానికి గురియ్యాడని తానే చెప్పారు. ఆ స్టంట్ చేయాల్సిన మాస్టర్ రాకపోవడంతో మనోజే స్వయంగా చేశారంట. అయితే గాల్లోకి కారు ఎగిరే స్టంట్ ను చేయాల్సి ఉండగా.. మనోజ్ చేసేద్దాం లే అనుకొని చేశారంట. కానీ అనుకున్న విధంగా స్టంట్ జరగలేదని చెప్పారు.
గాల్లోకి లేచి ముందుకు వెళ్లి కింద పడాల్సిన కారు.. గాల్లోకి లేచి స్టైట్ గా అయ్యిందని, ఇక నేరుగా ఇంజిన్ వచ్చి నేలకు గుద్దుకోవడంతో మనోజ్ మెడకు తీవ్రంగా గాయమైందన్నారు. అయితే అప్పుడు మెడలో నుంచి గట్టిగా శబ్దం రావడంతో తను చనిపోయాననే భయం కలిగిందంట. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ ప్రారంభించానని చెప్పారు. అంతేకాదు ఆ మరుసటి రోజే బాలకృష్ణతో 'ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా' సినిమా షూటింగ్ కు కూడా హాజరయ్యాయని చెప్పారు. కానీ మెడ సెట్ కావడానికి 60 రోజుల సమయం పట్టిందని చెప్పారు. ఇక ఆ తర్వాత నుంచి స్టంట్స్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నానని చెప్పారు. అది తన లైఫ్ లో పెద్ద ప్రమాదమని చెప్పుకొచ్చారు.
మనోజ్ నెక్ట్స్ సినిమాలు..
రాజు బాయ్, బిందాస్, నేను మీకు తెలుసా, మిస్టర్ నూకయ్య, వేదం, కరెంట్ తీగ వంటి చిత్రాలతో మనోజ్ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా 'భైరవం' చిత్రంతో థియేటర్లో దుమ్ములేపుతున్నారు. నెక్ట్స్ తేజా సజ్జా మిరాయి, రక్షక్, వాట్ ది ఫిష్ వంటి చిత్రాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











