HanuMan: 28ఏళ్లకే ఇరగ్గొట్టేశావ్.. నాకు, నా కొడుక్కి గూస్‌బంప్స్ తెప్పించావ్.. హనుమాన్‌పై హీరో సంచలన ట్వీట్
ఇప్పుడు దేశం మొత్తం ఒకటే పేరు వినిపిస్తుంది.. అదే హనుమాన్. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్టుగా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ నే కాదు.. చిన్న పిల్లలను కూడా మెప్పించింది. ఇక ఈ సినిమాపై సినీ రాజకీయ ప్రముఖులు రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరో కూడా ఈ సినిమాపై రివ్యూను ఇచ్చాడు. తనకు, తన కొడుక్కు తేజ సజ్జా గూస్ బంప్స్ తెప్పించాడని రాసుకువచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే...
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను నిర్మాత నిరంజన్ రెడ్డి రూ.60 కోట్లతో తెరకెక్కించారు.

ఇక కేవలం 60 కోట్ల రూపాయలతో 600 కోట్ల విజువల్స్ ఇచ్చారని ప్రేక్షకులు హనుమాన్ చిత్ర దర్శకుడు, టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి నుంచి నందమూరి బాలకృష్ణ వరకు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా ఈ సినిమాను చూసి రివ్యూను ఇచ్చారు. ఆల్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక తాజాగా తేజ సజ్జాను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ లు కూడా కలిసి సత్కరించారు.
ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు హనుమాన్ చిత్రంపై మరో యంగ్ హీరో సంచలన ట్వీట్ చేశారు. ఆయన ఎవరో కాదు.. మంచు మనోజ్ తన ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు. తాను హనుమాన్ చిత్రం చూసినట్లు చెప్పిన మనోజ్.. తనకు తన కొడుక్కు గూస్ బంప్స్ తెప్పించారంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచు మనోజ్ తన ట్విట్టర్ వేదికగా రాస్తూ...ఇంద్ర సినిమాతో నాకు... హనుమాన్ సినిమాతో మా అబ్బాయి ధైరవ్ కు గూస్ బంప్స్ తెప్పించావ్ కదా తమ్ముడు తేజ సజ్జా... కిల్లర్ ఫెర్మామెన్స్.. అంటూ రాసుకువచ్చాడు. ఇక ఇరగొట్టేశావ్... 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ ను కవర్ చేశావ్.. అన్ అమైజింగ్ ఫిలిమ్ బై వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ వర్మ.. సూపర్.. ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్ అంటూ రాసుకువచ్చాడు.
హనుమాన్ చిత్ర బృందానికి మంచు మనోజ్ కంగ్రాట్స్ చెప్తూ.. జై శ్రీరామ్ అని తెలిపారు. ప్రస్తుతం మనోజ్ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ.. ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. నిజంగానే రెండు జనరేషన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు అంటున్నారు నెటిజన్స్.


Click it and Unblock the Notifications











