మంచు మనోజ్ కోసం రామ్ చరణ్.. 'అహం బ్రహ్మాస్మి' అలా మొదలైంది
మంచు మనోజ్ కమ్‌బ్యాక్ సినిమా 'అహం బ్రహ్మాస్మి' కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకొచ్చారు. ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

మూడేళ్ల విరామం.. మంచు మనోజ్ స్టెప్
మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‍పై తన ఎనర్జీని చూపించడానికి సిద్దమయ్యాడు మంచు మనోజ్. 'అహం బ్రహ్మాస్మి' అనే పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

సొంత బ్యానర్.. మూవీ విశేషాలు
'అహం బ్రహ్మాస్మి' సినిమాను మనోజ్.. తన సొంత బ్యానర్ మంచు మనోజ్ ఆర్ట్స్ (MM ఆర్ట్స్) బ్యానర్ పై రూపొందిస్తుండటం విశేషం. విద్య నిర్వాణ మంచు ఆనంద్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. మంచు మనోజ్, ఆయన తల్లి నిర్మల దేవి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

సినీ అమ్మ వచ్చేశా.. లవ్ యూ డార్లింగ్స్
''మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా ‘దొంగ దొంగది' సమయంలో ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యానో ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. నా జీవితమైన నా కళను మిస్సయ్యాను. ఇన్నిరోజులు నా ఆఫ్ స్క్రీన్ జర్నీని కూడా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. సినీ అమ్మ వచ్చేశా. లవ్ యూ డార్లింగ్స్'' అని మనోజ్ తెలిపాడు.

రామ్ చరణ్ క్లాప్.. మూవీ స్టార్ట్
ఇప్పటికే 'అహం బ్రహ్మాస్మి' మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. తాజాగా ఈ రోజు (మార్చి 6) సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రామ్ చరణ్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
మనోజ్ ఎమోషనల్ ట్వీట్
ఇకపోతే ఈ ముహూర్తపు షాట్‌కి రామ్ చరణ్ రానున్న నేపథ్యంలో నిన్ననే మనోజ్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఓ ఫ్రెండ్ కష్టకాలాన్ని సులభంగా మార్చేస్తాడు.. మంచి రోజులను ఇంకాస్త మంచిగా మలుస్తాడు. నా స్నేహితులందరికీ నేను మనస్ఫూర్తిగా విలువిస్తాను. నా స్నేహితులకు, కుటుంబానికి నేను చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తాను.. అలాంటి వాళ్లందరిలోంచి.. ఓ నిజమైన స్నేహితుడు రామ్ చరణ్ అని మనోజ్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











