వెళ్ళండి.. వెళ్లి మీరే చూడండి.. సాహూపై మంచు మనోజ్ రియాక్షన్
తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ లెవెల్‌లో చూపించిన చిత్రం 'బాహుబలి'. ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పుకునే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మరో భారీ చిత్రం 'సాహో'. ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, యాక్షన్ చిత్రాల పరంగా చూస్తే భారత దేశపు అతిపెద్ద మూవీ ఇది. ఇలాంటి సినిమా మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరిలోనూ గర్వం ఉంటుంది. అందుకే తెలుగు సినీ సెలబ్రిటీలు ప్రభాస్‌కి, సాహో టీంకి స్పెషల్ విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యాడు.
Read in English :Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starrer
''దేశవ్యాప్తంగా ఎదురు చూపులకు తెరపడింది. యంగ్ రెబల్ స్టార్ ఖాతాలో సాహో రూపంలో మరో బ్లాక్ బస్టర్ పడాలని కోరుకుంటున్నా. అందరూ మీ దగ్గర లోని థియేటర్స్‌కి వెళ్లి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సాహో చూసేయండి'' అని పేర్కొంటూ సాహో ఫీవర్ ఎవ్రీవేర్, సాహో డే అనే హాష్ ట్యాగ్స్ జత చేశాడు మంచు మనోజ్.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఈ సినిమా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.


Click it and Unblock the Notifications











