సింగిల్స్ డే స్పెషల్.. విడాకుల అనంతరం తొలిసారి కావడంతో మంచు మనోజ్ రియాక్షన్
పండుగలతో పాటు ఈ మధ్యకాలంలో స్పెషల్ డేస్ పురస్కరించుకొని విషెస్ తెలునుకుంటూ, సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు జనం. లవర్స్ డే. మదర్స్ డే, ఫాదర్స్ డే లాగే ఎవ్వరికీ పెద్దగా తెలియని సింగిల్స్ డే కూడా ఒకటుంది. దీనికి ప్రతీ యేటా ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూనే ఉంది. ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా ఈ రోజును జరుపుకుంటుండటం గమనించదగిన విషయం.
టీనేజ్ పిల్లాడి దగ్గరి నుండి.పెళ్లై విడాకులు తీసుకున్న వారి వరుకూ అందరూ సోషల్ మీడియా వేదికగా సింగిల్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో మంచు మనోజ్ కూడా సింగిల్స్ డే పై ఓ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. నేడు (నవంబర్ 11) సింగిల్స్ డే కావడంతో.. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను 'ఐ లవ్ మి' సింగిల్స్ డే అంటూ తన సందేశాన్ని పోస్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. దీంతో మనోజ్‌కి సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మంచు మనోజ్ ఇటీవలే తన రెండేళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. విడాకులతో తన వివాహ బందానికి ముగింపు పలికిన మంచు వారబ్భాయి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించి సంచలనం సృష్టించాడు. తనకు, తన భార్యకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, అందుకే విడిపోతున్నామని ప్రకటించాడు మనోజ్. మరోవైపు విడాకుల అనంతరం మంచు మనోజ్ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, ఇకపై తన ద్యాస అంత సినిమాల పైనే ఉంటుందని చెప్పాడు. చూడాలి మరి మనోజ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయనేది.


Click it and Unblock the Notifications











