మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు .. ఆస్తి కోసం కాదు.. ఒక మగాడిగా రండి అంటూ..

గడిచిన కొన్ని నెలలు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో ఒక కాంట్రవర్సీ అలా హైలైట్‌గా వినిపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదిలోనే యువ హీరో రాజ్ తరుణ్ నుంచి మొదలైన రచ్చ ఇపుడు మరింత మంది స్టార్స్ పేర్లతో పలు ఇష్యూస్ తో కొత్త కొత్త హీట్ ఎక్కించే విధంగా పలు అంశాలు హైలైట్ గా మారాయి. అయితే ఇపుడు తెలుగు సినిమాలో ఆకస్మికంగా వచ్చి హైలైట్ అయ్యిన అంశం ఏదన్నా ఉంది అంటే అది మంచు వారి తగాదాలు అని చెప్పాలి.

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు కుటుంబం అంటే తెలియని వారు ఉండరు. వారి మాటలు, సినిమాలతో ఎప్పటికపుడు ట్రెండింగ్ టాపిక్ గా నిలిచే వీరిలో కొంచెం రియాలిటీకి దగ్గరగా భిన్నంగా ఉండేది మాత్రం మంచు మనోజ్ అని చాలా మంది అంటుంటారు. కాగా ఇదే మంచు మనోజ్ విషయంలో ఇపుడు పలు షాకింగ్ న్యూస్ బయటకి రావడం అనేది ఇపుడు సంచలనంగా మారింది.

manchu manoj shares shocking facts over mohan babu controversy

స్వయంగా తన తండ్రే తనపై దాడులు చేస్తున్నాడు, చేయిస్తున్నారు అంటూ మంచు మనోజ్ న్యాయం కోసం పోరాటం చేయడం టాలీవుడ్‌లో షాకింగ్ గా మారింది. కాగా మోహన్ బాబు కూడా మనోజ్‌పై రివర్స్‌లో కేసు పెట్టడంతో అసలు నిజం ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు. కానీ వీరి కాంట్రవర్సీ మాత్రం అంతకంతకూ హీట్ పెంచుతుంది. కాగా లేటెస్ట్ గా మంచు మనోజ్ చేసిన పలు సంచలన కామెంట్స్ అటెన్షన్ తెచ్చుకున్నాయి.

ఈ గొడవలు, ఆస్తి కోసమో, డబ్బులు కోసమో కాదని నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను అని తెలిపాడు. అలాగే ఇందులో తన కోసం కాదు నా భార్య, 7 నెలల పసికందుని ఇబ్బంది పెట్టడం కాదు . ఒక మగాడిగా నన్ను ఎదుర్కోవాలని మనోజ్ సవాలు చేస్తున్నాడు. అలాగే తన సెక్యూరిటీ విషయంలో కూడా పోలీసు శాఖ వారిపై మనోజ్ అసహనం వ్యక్తం చేసాడు.

manchu manoj shares shocking facts over mohan babu controversy

తాను పర్సనల్ గా పెట్టించుకున్న సెక్యూరిటీ తీయించేసే అధికారం పోలీసులకి ఎలా ఉంది అని మనోజ్ ప్రశ్నిస్తున్నారు. పోలీసు వారు కూడా ఏక పక్షంగా మారిపోయారు అంటూ ఆయన ఆరోపించడం కలకలం రేపుతోంది. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు మరింత సంచలనంగా మారాయి. ఇక ఈ గొడవల్లోనే మంచు విష్ణు కూడా ఇపుడు విదేశాల నుంచి తిరిగి వచ్చినట్టుగా తెలుస్తుంది.

తన రాకతో ఈ కాంట్రావర్సీ పెరుగుతుందా? లేదా కొనసాగుతుందా? అనేది మాత్రం ఇపుడు చూడాలి. కాగా ఇపుడు మోహన్ బాబు అలాగే మంచు విష్ణులు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "కన్నప్ప" లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ బడ్జెట్ తో విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమ నలు మూలల నుంచి బిగ్ స్టార్స్ కలయికలో తెరకెక్కుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X