మంచు మనోజ్ ఫొటో వెనుక రహస్యం తెలిసిపోయింది
మంచు మనోజ్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో ప్రయోగాలు చేశాడు. యాక్టర్‌గానే కాకుండా యాక్షన్ డైరెక్టర్‌గానూ సత్తా చాటాడు. ఒకానొక సందర్భంలో వరుస పెట్టి సినిమాలు చేసిన మంచు వారి అబ్బాయి.. తాజాగా స్పీడును తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒక్క సినిమాను కూడా చేయడం లేదు. దీంతో మనోజ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
అభిమానుల బాధను అర్థం చేసుకున్నాడో ఏమో గానీ మంచు మనోజ్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా షార్ట్ ఫిల్మ్ మేకర్ అయిన శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను మోహన్ బాబు సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తారని కూడా తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారని సమాచారం.

ఇటీవల మనోజ్ ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ పిక్ మార్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇన్ని రోజులూ కాస్త బొద్దుగా కనిపించిన అతడు.. ఈ పిక్‌లో మాత్రం ఫిట్‌గా దర్శనమిచ్చాడు. ఈ కొత్త మేకోవర్ కు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వాస్తవానికి అప్పుడే మనోజ్ కొత్త సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్ర బయటకు రాలేదు. ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్నట్లు వార్త బయటకు రావడంతో ఆ ఫొటో వెనుక రహస్యం తెలిసిపోయింది.


Click it and Unblock the Notifications











